Crow - Deer: కాకి కోసం జింక త్యాగం.. ఏం చేసిందో మీరే చూడండి..! అయ్యో పాపం అంటున్న నెటిజన్లు..

Crow – Deer: కాకి కోసం జింక త్యాగం.. ఏం చేసిందో మీరే చూడండి..! అయ్యో పాపం అంటున్న నెటిజన్లు..

Anil kumar poka

|

Updated on: May 01, 2023 | 8:46 AM

ఓ పార్క్‌లాంటి ప్రదేశంలో ఓ జింక చెట్టుకింద పడుకొని సేదదీరుతోంది. ఇంతలో ఓ కాకి అటువైపు వచ్చింది. ఆ జింకను చూసిన కాకికి ఓఐడియా వచ్చింది. తను కట్టుకుంటున్న గూటిలో మెత్తగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలనుకుంది. అందుకు ఈ జింకనుంచి

పక్షులు గూళ్లు కట్టుకోడానికి పుల్లలు, చెట్ల ఆకులు, గడ్డి పరకలు, దూది లాంటివాటిని సేకరిస్తాయి. అందంగా గూళ్లు కట్టుకొని వాటిలో గుడ్లు పెడతాయి. తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంటాయి. అలా ఓకాకి తను గూడు కట్టుకోడానికి అవసరమైన సామాగ్రి సేకరిస్తోంది. అందుకు ఆ కాకి చేసిన పనికి నెటిజన్లు తెగ ఇంప్రెస్‌ అయిపోతున్నారు. ఇంతకీ ఆ కాకి ఏం చేసిందో తెలుసా.. ఓ పార్క్‌లాంటి ప్రదేశంలో ఓ జింక చెట్టుకింద పడుకొని సేదదీరుతోంది. ఇంతలో ఓ కాకి అటువైపు వచ్చింది. ఆ జింకను చూసిన కాకికి ఓఐడియా వచ్చింది. తను కట్టుకుంటున్న గూటిలో మెత్తగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలనుకుంది. అందుకు ఈ జింకనుంచి వెంట్రుకలు తీసుకుంటే ఓ పనైపోతుంది అనుకుంది. వెంటనే ఆ జింక దగ్గరకు వెళ్లింది. దాని చిన్ని తోక నుంచి తెల్లగా గుబురుగా ఉన్న వెంట్రులను తన ముక్కుతో లాగడం మొదలుపెట్టింది. కాకి అలా వెంట్రుకలు లాగుతున్నా ఆ జింక దానిని ఏమీ అనడం లేదు. దానికీ అర్ధమైనట్టుంది. కాకి ఇల్లు కట్టుకుంటోంది అని. తన వంతు సాయం చెయ్యాలనుకుందో ఏమో కాకిని ఏమీ అనలేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. గూడు కట్టుకోవడానికి ఆ కాకి పడుతున్న కష్టం జింక అర్ధం చేసుకుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను 17 లక్షలమందికి పైగా వీక్షించారు. 60 వేలమంది లైక్‌ చేశారు. పాజిటివ్‌ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ‘కాకి తరఫున ఆ జింకకు థ్యాంక్స్’ అంటూ ఒకరు రాస్తే.. మరికొందరు ‘అవసరం బాబు.. పిల్లలకు ఇల్లు కట్టాలి’ అంటూ సరదాగా స్పందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

Published on: May 01, 2023 08:46 AM