Deer Viral Video: నగర వీధుల్లో లేడిపిల్ల షికారు.. ముచ్చటపడిపోతున్న నెటిజన్లు.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ మనం జంతువులకు సంబంధించిన ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. తాజాగా ఓ జింకపిల్లకు సంబంధించిన వీడియో నెట్టింట పరుగులు పెడుతోంది. అవును.. ఇందులో ఓ అందమైన జింకపిల్ల నగరవీధుల్లో షికారుకు వచ్చినట్టుంది.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ మనం జంతువులకు సంబంధించిన ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. తాజాగా ఓ జింకపిల్లకు సంబంధించిన వీడియో నెట్టింట పరుగులు పెడుతోంది. అవును.. ఇందులో ఓ అందమైన జింకపిల్ల నగరవీధుల్లో షికారుకు వచ్చినట్టుంది. ఆ సమయంలో రోడ్డుమీద ఎలాంటి వాహనాల రద్దీకూడా లేకపోవడంతో ఆ చిన్నారి జింకపిల్ల చెంగు చెంగున ఎగురుతూ పరుగులు తీస్తోంది. బంగారు వర్ణంలో ఉన్న ఆ చిన్ని జింకపిల్ల ఎంతో అందంగా హుషారుగా పరుగెత్తుతోంది. ఇంతకీ ఈ జింకపిల్ల అక్కడికెలావచ్చింది? ఈ వీడియో ఎక్కడ ఎవరు తీశారో క్లారిటీ లేదుకానీ వీడియో మాత్రం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 31 లక్షలమందికి పైగా వీడియోను వీక్షించారు. దాదాపు 2 లక్షల మంది లైక్ చేశారు. అంతే కాదు తమదైనశైలిలో కామెంట్లు కురిపిస్తున్నారు. ‘ట్రిప్‌కి వెళ్దామని నా భార్యకు చెప్తే.. ఆమె కూడా ఇలాగే పరుగులు తీస్తుంది’ అంటూ ఓ నెటిజన్ సరదాగా రాసుకొచ్చాడు. ‘నిజంగా నమ్మలేకపోతున్నా.. నేను నిద్రలో ఉన్నానేమో అనిపిస్తుంది’ అంటూ మరో నెటిజన్ వీడియోపై తన స్పందనను తెలియజేశాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!