దాహంతో అల్లాడిన ఆవు.. చలివేంద్రం వద్ద నీళ్లు తాగుతున్న ఆవు వీడియో.

|

May 09, 2024 | 1:56 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఓ వైపు ఎండలు, మరోవైపు వడగాల్పులు ఉక్కపోతతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇటు మూగజీవులు సైతం తాగేందుకు నీటిచుక్క దొరక్క అల్లాడుతున్నాయి. ఎక్కడైనా నీటిబొట్టు కనిపిస్తే గొంతు తడుపుకుందామా అన్నట్టు చూస్తున్నాయి. తాజాగా మహబూబాబాద్‌ జిల్లాలో పిడచకట్టుకుపోతున్న గొంతును తడుపుకునేందుకు ఆవుపడిన ఆరాటం చూపరును కదిలించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఓ వైపు ఎండలు, మరోవైపు వడగాల్పులు ఉక్కపోతతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇటు మూగజీవులు సైతం తాగేందుకు నీటిచుక్క దొరక్క అల్లాడుతున్నాయి. ఎక్కడైనా నీటిబొట్టు కనిపిస్తే గొంతు తడుపుకుందామా అన్నట్టు చూస్తున్నాయి. తాజాగా మహబూబాబాద్‌ జిల్లాలో పిడచకట్టుకుపోతున్న గొంతును తడుపుకునేందుకు ఆవుపడిన ఆరాటం చూపరును కదిలించింది. రోడ్డుపై వెళ్తున్న ఓ ఆవు వేసవి తాపంతో అల్లాడిపోయింది. గొంతు ఆరిపోతుండటంతో నీటికోసం వెదికింది. అలా వెళ్తుండగా ఓ చోట చలివేంద్రం కనిపించింది. వెంటనే ఆవుకు ప్రాణం లేచివచ్చినట్టనిపించింది. వెంటనే ఆ చలివేంద్రం దగ్గరకు వెళ్లి ఆ ట్యాప్‌నుంచి వచ్చే వాటర్‌ను నాలుకతో అందుకుంటూ ఎంతో ఆబగా నీరు త్రాగడం చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. ఇంతలో ఆవు అలా నీళ్లు తాగడం గమనించిన ఓ మహిళ అక్కడకు వచ్చి ట్యాప్‌ విప్పి పట్టుకుని ఆవు నీళ్లు తాగేందుకు సహకరించింది. హాయిగా నీళ్లుతాగి తృప్తిగా ఆవు అక్కడినుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మూగజీవుల కోసం తాగు నీటిని ఏర్పాటు చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.