Viral: అయ్యప్పభక్తుడిగా మారిన చర్చి ఫాదర్‌..! శబరిమల వెళ్లేందుకు ఫాదర్ గా లైసెన్స్ రద్దు.

Viral: అయ్యప్పభక్తుడిగా మారిన చర్చి ఫాదర్‌..! శబరిమల వెళ్లేందుకు ఫాదర్ గా లైసెన్స్ రద్దు.

Anil kumar poka

|

Updated on: Sep 13, 2023 | 3:56 PM

ప్రసిద్ధ శబరిమల ఆలయాన్ని సందర్శించాలనుకున్న ఓ చర్చి ఫాదర్ సేవకుడిగా తనకున్న లైసెన్సును వదులుకున్న ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది. రెవరెండ్‌ మనోజ్‌ కేజీ అనే వ్యక్తి ఆంగ్లికన్ చర్చి ఆఫ్‌ ఇండియాలో ఫాదర్‌గా ఉన్నారు. ఆయన ప్రసిద్ధ శబరిమల క్షేత్రాన్ని సందర్శించాలనుకున్నారు. ఇందులో భాగంగా ఇతర భక్తుల్లానే ఆయన కూడా మండల దీక్ష కొనసాగిస్తున్నాన్నారు.

ప్రసిద్ధ శబరిమల ఆలయాన్ని సందర్శించాలనుకున్న ఓ చర్చి ఫాదర్ సేవకుడిగా తనకున్న లైసెన్సును వదులుకున్న ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది. రెవరెండ్‌ మనోజ్‌ కేజీ అనే వ్యక్తి ఆంగ్లికన్ చర్చి ఆఫ్‌ ఇండియాలో ఫాదర్‌గా ఉన్నారు. ఆయన ప్రసిద్ధ శబరిమల క్షేత్రాన్ని సందర్శించాలనుకున్నారు. ఇందులో భాగంగా ఇతర భక్తుల్లానే ఆయన కూడా మండల దీక్ష కొనసాగిస్తున్నాన్నారు. ఈ నెల 20న అయ్యప్పను దర్శించుకోనున్నారు. అయితే దీనిపై దుమారం రేగడంతో చర్చి సేవల నుంచి తప్పుకున్నారు. మతాల కంటే దేవుడు అనే భావనకే తాను ప్రాధాన్యం ఇస్తానని మనోజ్‌ చెప్పారు. తన దీక్ష గురించి తెలిసి చర్చి వర్గాలు వివరణ కోరాయని, దీంతో వారిచ్చిన ఐడీ కార్డు, లైసెన్సు తిరిగి ఇచ్చేశానని వెల్లడించారు. మతాచారాలకు అతీతమైన హిందూయిజంపై అవగాహన పెంచుకోవడమే తన ఉద్దేశమని తెలిపారు. చర్చిలో చేరింది కూడా ఈ ఆలోచనతోనేనని స్పష్టం చేశారు. ఈ నెల 20న శబరిమల క్షేత్రానికి వెళ్లడానికి ప్లాన్‌ చేసుకుంటున్నాని పేర్కొన్నారు. చర్చి బాధ్యతలు తీసుకోకముందు మనోజ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేశారు. అయ్యప్పస్వామి దీక్ష తీసుకున్న మనోజ్ నల్లదుస్తులు ధరించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నెల 20న ఆయన శబరిమల అయ్యప్పను దర్శించుకోనున్నారు. తానేమీ తప్పు చేయలేదని విశ్వసిస్తున్నానని, హిందూ మతాన్ని దాని ఆచారాలకు అతీతంగా అర్థం చేసుకోవడమే తన ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పుకొచ్చారు. క్రైస్తవంలో తాను అదే పని చేశానని వివరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..