చెరువు కట్టపై వింత జీవులు.. భయాందోళనలో ప్రజలు
కరీంనగర్ జాల్లాలో వింత జీవులు కలకలం రేపాయి. గంగాధర మండలం భూర్గుపల్లి చెరువు కట్టపై ఈ వింత జంతువులను గుర్తించారు స్థానికులు. బూరుగుపల్లి గ్రామ చెరువు కట్ట మైసమ్మ వద్ద దూలం కృష్ణ అనే వ్యక్తి తన పొలం వద్ద పాడి గేదెలకు మేత వేస్తుండగా చెరువు కట్ట వద్ద పది నుంచి 15 వరకు ఉన్న వింత జీవులు కనిపించడంతో భయాందోళనకు గురి అయ్యాడు. గ్రామస్తులకు విషయాన్ని తెలిజేశాడు. కొందరు వాటిని నీటి కుక్కలుగా అనుమానం వ్యక్తం చేశారు.
కరీంనగర్ జాల్లాలో వింత జీవులు కలకలం రేపాయి. గంగాధర మండలం భూర్గుపల్లి చెరువు కట్టపై ఈ వింత జంతువులను గుర్తించారు స్థానికులు. బూరుగుపల్లి గ్రామ చెరువు కట్ట మైసమ్మ వద్ద దూలం కృష్ణ అనే వ్యక్తి తన పొలం వద్ద పాడి గేదెలకు మేత వేస్తుండగా చెరువు కట్ట వద్ద పది నుంచి 15 వరకు ఉన్న వింత జీవులు కనిపించడంతో భయాందోళనకు గురి అయ్యాడు. గ్రామస్తులకు విషయాన్ని తెలిజేశాడు. కొందరు వాటిని నీటి కుక్కలుగా అనుమానం వ్యక్తం చేశారు. గ్రామంలో ఇలాంటి వింత జీవులను మునుపెన్నడూ చూడలేదని అంటున్నారు గ్రామస్తులు. పొలాలకు వెళ్తే అవి తమపై దాడిచేస్తాయేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు ఆ వింత జంతువులు గ్రామంలోకూడా చొరబడతాయేమోనని భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. ఆ వింత జంతువులు సంచరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటవీ అధికారులు చొరవ చూపి వాటిని పట్టుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ పామును చూసి మగాళ్లే వణికిపోయారు.. ఆ యువతిమాత్రం..
ఆపరేషన్ థియేటర్లో కత్తులు పట్టాల్సిన డాక్టర్లు.. కర్రలు పట్టారు
బయటపడ్డ బంగారు గుడ్డు.. జీవి కోసం శాస్త్రవేత్తల వేట !!
నటుడు, నాయకుడే కాదు.. కామాంధుడు! మోసపోయిన నటి ఆవేదన