AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెళ్లి వేదికపై ఊహించని సంఘటన.. పెళ్లి కూతురు చేసిన పనికి షాక్‌ అయిన వరుడు..

Viral Video: వందేళ్ల జీవితం అనే ప్రయాణంలో వివాహం ఒక మజిలి అని చెబుతుంటారు. అందుకే ఈ వేడుకను ఎప్పటికీ మరిచిలోలేని మధుర జ్ఞాపకంలా మార్చుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే కొందరిలో విషయంలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా మారుతుంటుంది...

Viral Video: పెళ్లి వేదికపై ఊహించని సంఘటన.. పెళ్లి కూతురు చేసిన పనికి షాక్‌ అయిన వరుడు..
Viral Video
Narender Vaitla
|

Updated on: Apr 18, 2022 | 5:46 PM

Share

Viral Video: వందేళ్ల జీవితం అనే ప్రయాణంలో వివాహం ఒక మజిలి అని చెబుతుంటారు. అందుకే ఈ వేడుకను ఎప్పటికీ మరిచిలోలేని మధుర జ్ఞాపకంలా మార్చుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే కొందరిలో విషయంలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా మారుతుంటుంది. నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకోవడమో, పాట్నర్‌ ప్రవర్తన నచ్చక పోవడమో కారణం ఏదైనా కొందరు వివాహ వేడుకల్లోనూ చిర్రుబొర్రుమంటుంటారు. ఇంకో అడుగు ముందుకేసి చేయి కూడా చేసుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు గతంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సందర్భాలు చూసే ఉంటాం..

తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియానుల షేక్‌ చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌ పూర్‌లో జరిగిన పెళ్లి వేడుకలో చోటుచేసుకున్న ఓ సంఘటన వరుడితో పాటు, వివాహానికి హాజరైన వారికి షాక్‌కి గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌ జిల్లాకు చెందిన యువతికి, బలౌన్‌ జిల్లా చమరి గ్రామానికి చెందిన యువకుడికి వివాహం నిశ్చయమైంది. ఇందులో భాగంగానే ఆదివారం వీరి పెళ్లి వేడుకను కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ క్రమంలోనే వివాహ తంతు ముగిసిన తర్వాత నూతన వదూవరులు స్టేజ్‌పై నిల్చున్నారు.

ఈ సమయంలోనే వరుడు, వధువు మెడలో పూలమాల వేయడానికి ప్రయత్నించాడు. అప్పటి వరకు బాగానే ఉన్న పెళ్లి కూతురు ఒక్కసారి కోపంగా వరుడు చెంపపై చెల్లుమనిపించింది. అంతటితో ఆగకుండా స్టేజ్‌ దిగి వెళ్లిపోయింది. దీంతో పెళ్లి కొడుకుతో పాటు, అక్కడ ఉన్న వారంతా నివ్వెర పోయారు. అనంతరం అక్కడ వరుదు, వరుడు తరఫు బంధువుల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వదువు, వరుడిపై ఎందుకు చేయి చేసుకుందన్న విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు.

Also Read: Telangana: కోదాడలో దారుణం.. మూడు రోజులుగా అత్యాచారం.. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి..

Viral Video: హింస కేసు నిందితుడి కండ కావరం.. కోర్టు లోపలికి వెళ్తూ.. ‘తగ్గేది లే’ అంటూ సిగ్నల్

Bandi Sanjay Yatra: బండి సంజయ్‌ పాదయాత్రలో ఉద్రిక్తత.. ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’ను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు