Gujarat: బాలుడిపై కోతుల గుంపు దాడి.. చివరకు ఏం జరిగిందంటే.? గుజరాత్‌లో ఘటన..
మొన్నటివరకు వీధి శునకాలు జనాలపై దాడులు చేసి, తీవ్ర భయాందోళనకు గురి చేశాయి. ఇప్పుడు కోతుల వంతు వచ్చింది. తాజాగా గుజరాత్‌లో ఓ పదేళ్ల బాలుడిపై దాడిచేసి దారుణంగా హతమార్చాయి కోతులు. గాంధీనగర్లోని సల్కి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దేగామ్ తాలూకాలోని ఓ గుడికి సమీపంలో బాలుడిపై కోతులు దాడి చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. దీపక్ ఠాకూర్ అనే బాలుడు స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా కోతుల గుంపు ఒకటి అక్కడికి వచ్చింది.
మొన్నటివరకు వీధి శునకాలు జనాలపై దాడులు చేసి, తీవ్ర భయాందోళనకు గురి చేశాయి. ఇప్పుడు కోతుల వంతు వచ్చింది. తాజాగా గుజరాత్‌లో ఓ పదేళ్ల బాలుడిపై దాడిచేసి దారుణంగా హతమార్చాయి కోతులు. గాంధీనగర్లోని సల్కి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దేగామ్ తాలూకాలోని ఓ గుడికి సమీపంలో బాలుడిపై కోతులు దాడి చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. దీపక్ ఠాకూర్ అనే బాలుడు స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా కోతుల గుంపు ఒకటి అక్కడికి వచ్చింది. పిల్లలంతా భయంతో పారిపోయారు. పదేళ్ల బాలుడు దీపక్ మాత్రం కోతులకు దొరికిపోయాడు. కోతులన్నీ కలిసి బాలుడిపై దూకాయి. అతడిపై దాడి చేస్తూ గోళ్లతో బాలుడి పొట్టను చీల్చి ఏకంగా పేగులను బయటకు లాగేశాయి. స్థానికులు కోతులను బెదిరించి బాలుడిని ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే దీపక్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సల్కి గ్రామంలో వారం వ్యవధిలోనే కోతులదాడికి సంబంధించి ఇది మూడో ఘటన అని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. మిగతా రెండు ఘటనల్లో బాధితులను కాపాడినట్లు తెలిపారు. కోతులను బంధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ఒకటే వేట.. లక్షల్లో పంట.. జాలరి వలలో భారీ చేపలు
పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!
ఘాట్రోడ్లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!
ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన
గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?
రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!
ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు!

