Boy Scating: మంచులో అద్భుతంగా స్కేటింగ్‌ చేస్తున్న చిన్నారి.. మధ్యలో ఊహించని ట్విస్ట్‌..

Updated on: May 28, 2022 | 8:37 PM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వైరల్‌ వీడియోలు మనం చూస్తుంటాం. వాటిలో కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక చిన్నారుల వీడియోలు అయితే నెటిజన్లు ఫిదా అయిపోతారు. తాజాగా


సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వైరల్‌ వీడియోలు మనం చూస్తుంటాం. వాటిలో కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక చిన్నారుల వీడియోలు అయితే నెటిజన్లు ఫిదా అయిపోతారు. తాజాగా ఓ చిన్నారి వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ బుడతడు..స్కేటింగ్‌ చేస్తూ ఉంటాడు. అంతలో ఆ బుడ్డోడికి ఊహించని షాక్‌ తగిలింది… ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక చిన్న పిల్లవాడు స్కేట్‌పార్క్‌లో ఫుల్‌ ప్రొటెక్షన్‌తో స్కేటింగ్‌ చేస్తున్నాడు. ఎత్తైన మంచుప్రదేశం నుండి రయ్‌య్‌..మంటూ కిందకు దిగడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ, అతడు వెళ్తున్న మార్గంలో అనుకోకుండా ఓ ఎత్తైన దిబ్బలాంటిది ఎదురైంది..అతడు వెళ్తున్న స్పీడ్‌కి ఆ దిబ్బ వద్ద వేగం కంట్రోల్‌ చేయలేకపోయాడు..దాంతో ఒక్కసారిగా అంత ఎత్తుకు ఎగిరి కిందపడ్డాడు..అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు..బాలుడు సురక్షితంగా ఉన్నాడు..ఇక బాలుడు పడ్డ విధానం చూసి అక్కడ ఉన్నవాళ్లంతా తెగ నవ్వుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

 

Published on: May 28, 2022 08:37 PM