Bear in Home: ఇంట్లో ఎలుగుబంటి.! ఆరు బయట భయంతో జనం.. వీడియో.

|

Apr 04, 2024 | 9:10 PM

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలో ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. గ్రామంలోకి ప్రవేశించి సంచరించిన భల్లూకం ఊరు మధ్యలోని ఓ పాడుబడిన ఇంటిలోకి చొరబడి ఇంట్లోనే తిష్ట వేసింది. దానిని చూసి భయాందోళనలకు గురైన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ఎలుగుబంటిని పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలో ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. గ్రామంలోకి ప్రవేశించి సంచరించిన భల్లూకం ఊరు మధ్యలోని ఓ పాడుబడిన ఇంటిలోకి చొరబడి ఇంట్లోనే తిష్ట వేసింది. దానిని చూసి భయాందోళనలకు గురైన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ఎలుగుబంటిని పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల ఇదే మండలంలో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన మరవక మందే మళ్లీ ఎలుగుబంటి సంచారం గ్రామ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. వ్యవసాయ పొలాలు, ఇళ్ల మధ్య ఎలుగుబంటి సంచారంతో గ్రామస్థులు బెంబేలెత్తిపోతున్నారు. ఎలుగుబంటి సంచారంతో ఇంటి బయట నిద్రించాలన్నా, వ్యవసాయ కూలీ పనులకు వెళ్లాలన్న ప్రజలు భయపడుతున్నారు. ఏ సమయంలో వచ్చి ఎవరిపై దాడి చేస్తుందోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఎలుగుబంటి బంధించి అడవిలో వదిలి పెట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు. తమ ప్రాంతం వాసులను ఎలుగుబంటి నుంచి రక్షించవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..