Cycling: హమ్మయ్య..కొద్దిలో బ్రతికిపోయాడు..! లేకపోతే ఎలుగుబంటికి దొరికిపోయేవాడే.. Viral Video

కొంతమంది సైకిల్ మీద సాహసాలు చేస్తుంటారు. సైకిలింగ్ అంటే ఎంతో పిచ్చి వారికి. కొన్ని దేశాల్లో సైకిల్ తొ అడవుల్లో..గుట్టల్లో తిరిగేస్తారు. అలా గుట్టల్లో.. మట్టి రోడ్లమీద సైక్లింగ్ పోటీలు చాలా దేశాల్లో నిత్యం జరుగుతూనే ఉంటాయి.

Cycling: హమ్మయ్య..కొద్దిలో బ్రతికిపోయాడు..! లేకపోతే ఎలుగుబంటికి దొరికిపోయేవాడే.. Viral Video
Bear Chasing Cyclist
Follow us
KVD Varma

|

Updated on: Apr 21, 2021 | 6:22 PM

Cycling: కొంతమంది సైకిల్ మీద సాహసాలు చేస్తుంటారు. సైకిలింగ్ అంటే ఎంతో పిచ్చి వారికి. కొన్ని దేశాల్లో సైకిల్ తొ అడవుల్లో..గుట్టల్లో తిరిగేస్తారు. అలా గుట్టల్లో.. మట్టి రోడ్లమీద సైక్లింగ్ పోటీలు చాలా దేశాల్లో నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి సైక్లింగ్ కూడా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. సైకిల్ తొక్కుతుంటే అనుకోకుండా పడిపోవచ్చు.. లేదా ఎత్తైన ప్రదేశాల నుంచి దిగుతున్నపుడు బ్రేక్ కంట్రోల్ కాక సైకిల్ కిందికి పడిపోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు. కానీ, కొండల్లో గుట్టల్లో ఇటువంటి సైక్లింగ్ చేసేటప్పుడు క్రూర మృగాలు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. సరిగ్గా అలాగే ఓ సిక్లిస్ట్ కొండ ప్రాంతంలో డౌన్ లోకి రోడ్డు నుంచి దిగుతున్న సమయంలో అతని వెనుక ఓ ఎలుగుబంటి పడింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో ఓ సైక్లిస్ట్ అడవి మార్గంలో మలుపులతో కూడిన రోడ్డున్న గుట్ట మీద నుంచి కింది వైపుకు దిగుతున్నాడు. ఇంతలో ఎలుగుబంటి ఆ సైక్లిస్ట్ వెనుక పడింది. సైక్లిస్ట్ రోడ్డుపై వేగంగా కిందికి వెళ్లిపోతుంటే.. ఆ ఎలుగుబంటి అడ్డదారిలో అతన్ని వెంబడించింది. త్రుటిలో ఆ సైక్లిస్ట్ ఎలుగుబంటికి చిక్కకుండా తప్పించుకున్నాడు. స్పోర్ట్స్ గూడ్స్ వ్యాపారం చేసే మోంటానా నైఫ్ కంపెనీ ఈ వీడియోను తన ఇంస్టాగ్రామ్ ఎకౌంట్ లో షేర్ చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంది. అయితే, ఈ సంఘటన దాదాపు సంవత్సరం క్రితం జరిగింది. దీనిని ఆ స్పోర్ట్స్ కంపెనీ ఇప్పుడు విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియోలో చూసిన దానిప్రకారం కొద్ది సెకెన్ల తేడాతో ఆ సైక్లిస్ట్ బ్రతికిపోయాడు. ఇప్పుడు ఈ విషయం పైనే అందరూ కామెంట్లు చేస్తున్నారు. వేగంగా సైకిల్ తొక్కుతున్న ఆ సైక్లిస్ట్ ను పట్టుకోవడానికి ఎలుగుబంటి అడ్డదారుల్లో అంతకంటే వేగంగా పరిగెత్తింది. కానీ, సైక్లిస్ట్ వేగాన్ని అందుకోలేకపోయింది. ఇది చూసి సైక్లిస్ట్ వేగానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఆ వీడియో ఇదిగో..

Also Read: Hero MotoCorp: హీరో కంపెనీ సంచలన నిర్ణయం.. టూవీలర్ల తయారీ నిలిపివేత…! ఎందుకో తెలుసా..?

కోవిడ్ బీభత్సం, ఇండియా పర్యటనను రద్దు చేసుకున్న జపాన్ ప్రధాని, ఇప్పట్లో రానంటూ ప్రకటన

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!