Teacher-Student: గిదేంది టీచర్ గిట్లా జేశిన్రు.. పాఠాలు చెప్పాల్సిన స్టూడెంట్‌తో.. కట్ చేస్తే..

|

Apr 08, 2022 | 9:23 AM

టీనేజర్‌కి పాఠాలు చెప్పాల్సిన టీచర్..అసలు పాఠాలు పక్కనపెట్టి ప్రేమ పాఠాలు చెప్పింది. మాయమాటలు చెప్పి ఏకంగా గుడిలో పెళ్లి చేసుకుంది. ఆపై ఎవరికీ కనిపించకుండా వేరే చోటుకు వెళ్లి కొత్త కాపురం పెట్టింది. పోలీసులు అతి కష్టం మీద ఈ టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు.


టీనేజర్‌కి పాఠాలు చెప్పాల్సిన టీచర్..అసలు పాఠాలు పక్కనపెట్టి ప్రేమ పాఠాలు చెప్పింది. మాయమాటలు చెప్పి ఏకంగా గుడిలో పెళ్లి చేసుకుంది. ఆపై ఎవరికీ కనిపించకుండా వేరే చోటుకు వెళ్లి కొత్త కాపురం పెట్టింది. పోలీసులు అతి కష్టం మీద ఈ టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. తిరుచిరాపల్లి జిల్లా తురాయూర్ లోని ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో 11వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థి మార్చి 5న ఆడుకోడానికి అని బయటకు వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. దీంతో కంగారుపడ్డ అతని పేరెంట్స్.. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు కాలేజ్‌లో ఎంక్వైరీ చేశారు. ఈ క్రమంలో అదే కాలేజ్‌లో టీచర్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల షర్మిల కూడా కనిపించడం లేదని తెలిసింది. అనుమానంతో పోలీసులు షర్మిల ఇంటికి వెళ్లి ఆరా తీసారు. అయితే తమ కుమార్తె డైలీ ఫోన్‌లో ఓ స్టూడెంట్‌తో మాట్లాడుతుందని, తప్పని వారించినా పట్టించుకోలేదని చెప్పారు. దీంతో షర్మిల ఫోన్ ట్రాక్ చేశారు పోలీసులు. సిగ్నల్ ఆధారంగా షర్మిల ఫోన్ తిరుచిరాపల్లి జిల్లాలోని ఎడమలపట్టి పుత్తూర్​లో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. మెరుపు వేగంతో అక్కడికి చేరుకన్నారు. విద్యార్థితో కలిసి తన ఫ్రెండ్​ ఇంట్లో ఉన్న షర్మిల, విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. తంజావూరులోని ఓ గుడిలో మైనర్​ను పెళ్లాడినట్లు షర్మిల విచారణలో తెలిపింది. బాలుడిని అపహరించి, పెళ్లి చేసుకున్నందుకు ఆమెపై పోక్సో చట్టం కింద కేసు పెట్టి, పోలీసులు అరెస్టు చేశారు. ఆ విద్యార్థిని పేరెంట్స్‌కు అప్పగించారు. నిందితురాలిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, రిమాండ్​కు తరలించారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!

Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్‌ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నాడు..

Good News For Male: మగవారికి గుడ్‌న్యూస్.. ఆ ప్రయోగం సక్సెస్.. ఇంకేం భయంలేదు.. త్వరపడండి..

IPS Officer: అర్థరాత్రి సైకిల్‌పై లేడీ సింగం గస్తీ.! షాక్‌లో సీఎం స్టాలిన్‌..! వైరల్ అవుతున్న వీడియో..