ఆటో నడుపుతూ ఉపాధి పొందుతున్న 8ఏళ్ల బాలుడు.. వైరల్ వీడియో..: 8 Years Boy Ride Auto Video.

|

Sep 04, 2021 | 2:27 PM

హాయిగా ఆడుకోవాల్సిన వయసులో ఆ బుడ్డోడికి అనుకోని కష్టం వచ్చి పడింది. ఎనిమిదేళ్ల వయసులోనే కుటుంబ బాధ్యతలను మోయాల్సిన పరిస్థితి...కన్నవారికి కడుపునేందుకు..ఆ బుడతడు ఆటో డ్రైవర్‌ అవతారమెత్తాడు..

హాయిగా ఆడుకోవాల్సిన వయసులో ఆ బుడ్డోడికి అనుకోని కష్టం వచ్చి పడింది. ఎనిమిదేళ్ల వయసులోనే కుటుంబ బాధ్యతలను మోయాల్సిన పరిస్థితి…కన్నవారికి కడుపునేందుకు..ఆ బుడతడు ఆటో డ్రైవర్‌ అవతారమెత్తాడు..ఆటో సీట్లో సరిగా కూర్చుంటే కాళ్లు కూడా కిందకు అందవు. కానీ.. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పిల్లాడు ఆటో నడపాల్సి వస్తోంది. ఇంతకీ ఎవరా బుడ్డొడు..ఏంటా కథ..?ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజవర్గంలో ఓ యువకుడు కారులో వెళ్తున్నాడు. వెళ్లే దారిలో కొత్తగా మార్కెట్లోకి వచ్చిన బ్యాటరీ ఆటోను చూశాడు. ఆటో నడిపే వ్యక్తిన చూసిన ఆ యువకుడు ఒక్కసారిగా అవాక్కఅయ్యాడు. ఆ బ్యాటరీ ఆటో నడుపుతోంది యువకుడో, వృద్ధుడో కాదు… ఎనిమిదేళ్ల చిన్నారి రాజగోపాల్ రెడ్డి. పసివాడైన రాజగోపాల్ రెడ్డి ఆటో నడపడాన్ని గుర్తించిన ఆ యువకుడు వెంటనే అక్కడ ఆగిపోయి ఇంత చిన్న వయసులో ఎందుకు ఆటో నడుపుతున్నావ్ అని ఆరా తీయగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

చంద్రగిరి మండలం గంగుడుపల్లెకు చెందిన పాపిరెడ్డి, రేవతి దంపతులకు ముగ్గురు మగపిల్లలు. కానీ ఆ దంపతులిద్దరికీ కళ్లు కనిపించవు. తల్లిదండ్రులు అంధులు కావడంతో.. పెద్ద కొడుకైనా ఎనిమిదేళ్ల గోపాల్ రెడ్డి.. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. బ్యాటరీ ఆటో నడుపుతూ గ్రామంలో పప్పులు, బియ్యం అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు… ఇంత చిన్నపిల్లాడు ఆటో నడిపే క్రమంలో ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని.. మరో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపాలని కోరుతున్నారు.


మరిన్ని ఇక్కడ చూడండి: తల స్నానానికి అష్టకష్టాలు..! వ్యోమగాములు తల స్నానం ఎలా చేస్తారో తెలుసా.? వైరల్‌ వీడియో..! :Astronauts Wash Hair Video.

చూపు కోల్పోయినా కోటి ఎలా గెల్చుకుంది..?KBC లో cr.1 విన్నర్..: KBC 1 crore Winner Blind Girl Video.

బంగారు బాయ్‌ ఫ్రెండ్‌ కోసం ఓ సినిమా…! నయన్ ముందుగా పిలిచే పేరే సినిమా టైటిల్..(వీడియో): Nayanthara Video.

మిలిట్రీ శునకాలను అఫ్గాన్‌లోనే వదిలిన అమెరికాపై ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్లు..!(వీడియో): US Military Dogs.