Viral Video: స్వచ్ఛమైన ఈ ప్రేమను మాటల్లో ఎలా వర్ణించగలం.. ఈ వీడియో చూస్తే మీరూ ఇదే మాట అంటారు.
Viral Video: ప్రేమ అనేది అనిర్వచనీయమైన ఒక అనుభూతి. యువతీయువకుల మధ్యే కాదు.. ప్రేమ ఎవరిపై ఎవరికైనా కలగొచ్చు. దీనికి మనుషులు మాత్రమే కాదు...
Viral Video: ప్రేమ అనేది అనిర్వచనీయమైన ఒక అనుభూతి. యువతీయువకుల మధ్యే కాదు.. ప్రేమ ఎవరిపై ఎవరికైనా కలగొచ్చు. దీనికి మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా అతిథులేం కాదు. ముఖ్యంగా మనుషులకు శునకాలపై ఉండే ప్రేమను మాటల్లో వర్ణించలేం. విశ్వాసానికి మారుపేరైనా శునకాన్ని అందరూ ఇష్టపడుతుంటారు. అందుకే కొందరు శునకాలను ఎంతో ప్రేమగా, కుటుంబసభ్యులలో ఒకరిగా పెంచుకుంటారు.
తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో మనుషులకు, శునకాలకు మధ్య ఉండే ప్రేమకు సాక్ష్యంగా నిలుస్తోంది. స్కూల్‌కు వెళ్లిన ఓ అబ్బాయి తిరిగి ఇంటికి చేరుకునే సమయం దగ్గర పడింది. దీంతో ఆ చిన్నరి ఎంతో ప్రేమగా పెంచుకుంటోన్న శునకం, స్కూల్ బస్సు ఆగే చోటు నిల్చొని ఉంది. కుర్రాడి రాకకోసం వేయి కళ్లతో ఎదురు చూసిన ఆ శుకనం.. బస్సులో నుంచి బాలుడు దిగగానే గంతులేస్తూ అతని వద్దకు వెళ్లింది. దీనంతటినీ అక్కడే ఉన్న బాలుడి కుటుంబ సభ్యులు వీడియో తీసి సోషల్ మీడిఆయలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. కుర్రాడిపై ఆ మూగజీవి చూపించి ప్రేమకు ఫిదా అవుతున్నారు. స్వచ్ఛమైన ప్రేమకు ఈ వీడియో ప్రతిరూపం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
This is just pure love ?❤️ pic.twitter.com/lMtDvssNfi
— ❤️ A page to make you smile ❤️ (@hopkinsBRFC21) September 2, 2021
Also Read: Bigg Boss 5 Telugu: బిగ్బాస్ 5 షురూ.. హౌస్లోకి కంటెస్టెంట్స్.. ఫైనల్ లిస్ట్ ఇదే..
Taliban: సెక్స్ వర్కర్ల జాబితాను సిద్ధం చేసుకుంటున్న తాలిబన్లు.. కాలకేయుల అరాచకాలు ఇక షురూ..