Viral Video: 79 ఏళ్ల వయసులోనూ దేశరక్షణకోసం ఏకే 47 చేతపట్టి నేనుసైతం అంటున్న బామ్మ.. శభాష్ అంటున్న నెటిజన్లు..
Russia Ukraine Crisis: రష్యా- ఉక్రెయిన్ సరిహద్దుల్లో కొన్ని రోజుల నుంచి టెన్షన్ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. రష్యా ఉక్రెయిన్‌పై ఎప్పుడైనా దాడి చేసే అవకాశముందంటూ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే..
రష్యా- ఉక్రెయిన్ సరిహద్దుల్లో కొన్ని రోజుల నుంచి టెన్షన్ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. రష్యా ఉక్రెయిన్‌పై ఎప్పుడైనా దాడి చేసే అవకాశముందంటూ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే.. రష్యా దండయాత్రను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ పౌరులు, వృద్ధులు సైతం రంగంలోకి దిగారు. తాజాగా.. సోషల్ మీడియా లో ఓ ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. 79 ఏళ్ల వృద్ధురాలు ఏకే-47 ఆయుధం చేతబట్టి కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని చాలా మంది నెటిజన్లు షేర్ చేయడంతోపాటు కామెంట్లు చేస్తున్నారు.ఓ ప్రముఖ వెబ్‌సైట్ ప్రకారం.. రష్యా దాడి చేసే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితుల్లో పోరాటంలో పాల్గొనడానికి ఆయుధాలను చేతబట్టమని ఉక్రెయిన్ ప్రభుత్వం పౌరులకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా ఉక్రెయిన్ ప్రభుత్వం తన పౌరులకు శిక్షణ ఇస్తోంది. ఇందులో సాధారణ ప్రజలకు AK-47ను ఆపరేట్ చేయడం నేర్పుతున్నారు. శిక్షణా శిబిరంలో దాదాపు 79 ఏళ్ల వయసున్న వృద్ధురాలు కూడా ఉంది. ఆమె తన దేశాన్ని రక్షించుకోవడానికి AK-47తో కాల్పులు జరపడం నేర్చుకుంటుంది. ఈ క్రమంలో తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువతే.. దేశం కోసం పోరాటం చేయాలా..? నేను కూడా చేస్తానంటూ 79 ఏళ్ల బామ్మ వాటెంటినా శిక్షణ శిబిరానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వాలెంటినా పరిస్థితి మరింత దిగజారితే నేను కూడా కాల్పులు జరపడానికి సిద్ధంగా ఉన్నానంటూ పేర్కొన్నారు. నేను నా ఇంటిని, నా నగరాన్ని, నా పిల్లలను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ పేర్కొన్నారు. నా దేశాన్ని, నా నగరాన్ని కోల్పోవడం నాకు ఇష్టం లేదంటూ పేర్కొన్న ఈ బామ్మ ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..