Plastic in Cow: ఆవు కడుపులో 70 కేజీల ప్లాస్టిక్‌.! మనం చేసే తప్పుల వల్లే మూగజీవులు ఇలా..

|

Aug 25, 2024 | 3:33 PM

ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి, మూగ జీవాలకు, మానవాళికి ఎంత ప్రమాదముందో అందరికీ తెలిసిందే..! ప్లాస్టిక్ భూతం ఎంత ప్రమాదకరంగా మారుతుందో కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన ఘటన కళ్లకు కట్టినట్టు స్పష్టమవుతోంది. ఒక గోవు కడుపులో నుంచి 70 కేజీలకు పైగా ప్లాస్టిక్‌ను తొలగించి, గోవు ప్రాణాన్ని కాపాడారు పశు వైద్యలు. ఈఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగింది.

జిల్లాలోని ఎమ్మిగనూరులో రోడ్డుపై పడి ఉన్న ఒక గోవును చూశాడు స్థానిక న్యాయవాది బోయ తిమ్మప్ప. భారీ కడుపుతో ఆయాసంతో నడవలేక అవస్థపడుతున్న గోవును చూసి చలించిపోయాడు. ఆవును చూసి తన దారి తాను పోలేక స్థానిక పశు వైద్య అధికారులకు సమాచారం ఇచ్చారు. పరిశీలించిన పశు వైద్యులు హుటాహుటీన అక్కడికి చేరుకుని గోవు పరిస్థితిని గమనించారు. వెంటనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. అక్కడికక్కడే ఆవుకు శస్త్రచికిత్స చేసి, దాని కడుపులో నుంచి 70 కేజీల పైగా పేరుకుపోయిన ప్లాస్టిక్‌ను తొలగించారు. దీంతో చావు బతుకుల్లో ఉన్న గోవుకు పశువైద్యులు ప్రాణం పోశారు.

మిగిలిపోయిన ఆహారం లేదా ఇతరత్రా ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ప్రజలు రోడ్లపై పారవేస్తుంటారు. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న ఆహారం తోపాటు ప్లాస్టిక్‌ను కూడా గోవులు తినేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఎమ్మిగనూరు ఆవు సైతం ఫ్లాస్టిక్ వ్యర్థాలను తినడంతో, ఆవు కడుపు మొత్తం ప్లాస్టిక్‌తో నిండిపోయింది. ఇతర తిండి తినలేక, తిన్నా కూడా అరిగించలేక ఆవు ఆరోగ్యం దెబ్బతింది. ఆపరేషన్ చేసి ఆవు కడుపులోని ప్లాస్టిక్ మొత్తం తొలగించారు డాక్టర్లు. ప్రస్తుతం గోవు ఆరోగ్యం నిలకడగా ఉందని పశు వైద్యులు తెలిపారు. అందుకే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, ప్రజలు కూడా అమలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. గోవు పట్ల న్యాయవాది చూపిన చొరవకు పలువురు అభినందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.