Air India: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.! ఎమర్జెన్సీ లాండింగ్..
విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన సమాచారంతో ఎయిర్‌పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీ విధించారు. 135 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం.. ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అవుతుండగా.. బాంబు బెదిరింపు సమాచారం వచ్చిందని ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి. దీంతో వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులు పైలట్‌ను అలర్ట్ చేశారు. అయితే ఆ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయిన తర్వాత వెంటనే అందులో ఉన్న ప్రయాణికులను హుటాహుటిన బయటికి పంపించారు.
విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన సమాచారంతో ఎయిర్‌పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీ విధించారు. 135 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం.. ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అవుతుండగా.. బాంబు బెదిరింపు సమాచారం వచ్చిందని ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి. దీంతో వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులు పైలట్‌ను అలర్ట్ చేశారు. అయితే ఆ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయిన తర్వాత వెంటనే అందులో ఉన్న ప్రయాణికులను హుటాహుటిన బయటికి పంపించారు. అనంతరం ఆ విమానంలో గాలింపు చేపట్టారు. మరోవైపు.. ఈ ఘటనతో ఎయిర్‌పోర్టు మొత్తం పూర్తిస్థాయి ఎమర్జెన్సీ విధించారు. కేరళ రాజధాని తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది.
135 మంది ప్రయాణికులతో గురువారం ఉదయం ఎయిరిండియా విమానం ముంబైనుంచి తిరువనంతపురం బయలుదేరింది. ఉదయం 8 గంటలకు తిరువనంతపురం విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ అయినట్లు ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి. ఈ బాంబు బెదిరింపుతో అలర్ట్ అయిన అధికారులు.. తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పూర్తిస్థాయి ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇక బాంబు బెదిరింపు వచ్చిన విమానాన్ని ఎయిర్‌పోర్టులోని ఐసోలేషన్ బేకు తరలించి.. బాంబు స్క్వాడ్ సహా సెక్యూరిటీ ఏజెన్సీలు క్షుణ్ణంగా తనిఖీ చేసాయి. అయితే ఈ బాంబు బెదిరింపు ఘటనలో ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని తిరువనంతపురం ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు ప్రస్తుతం ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయని వెల్లడించారు. బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చింది? దాంట్లో వాస్తవమెంత? అనే అంశాలపై దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

