50 ఆవులను నదిలోకి తోసేసిన ఆకతాయిలు.. దాదాపు 20 ఆవులు మృతి
కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా ఆవులను నదిలోకి తోసేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. నదిలో 50 ఆవుల వరకు తోసేయగా.. వాటిల్లో 20 ఆవుల వరకు మృతి చెందినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని బామ్‌హోర్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద ఉన్న సత్నా నదిలోకి నలుగురు ఆకతాయిలు 50 ఆవులను తోసేశారు.
కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా ఆవులను నదిలోకి తోసేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. నదిలో 50 ఆవుల వరకు తోసేయగా.. వాటిల్లో 20 ఆవుల వరకు మృతి చెందినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని బామ్‌హోర్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద ఉన్న సత్నా నదిలోకి నలుగురు ఆకతాయిలు 50 ఆవులను తోసేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బెటా బగ్రి, రవి బగ్రి, రామ్‌పాల్ చౌదరీ, రాజ్లు చౌదరీ అనే నలుగురిని నిందితులుగా గుర్తించారు. అనంతరం వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నదిలోకి మొత్తం 50 ఆవులను తోసేసారని వాటిల్లో దాదాపు 15 నుంచి 20 ఆవులు మృతి చెందాయని తెలిపారు. మిగిలిన వాటిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికాను వణికిస్తోన్న ప్రాణాంతక “ట్రిపుల్ ఈ’ వైరస్