Electricity Bill: కరెంట్ బిల్లు చూసి షాక్ తిన్న వృద్ధురాలు ఇల్లూ వద్దు..బిల్లు వద్దు అంటూ నిరసన..
ఓ వృద్ధురాలికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ షాకిచ్చింది. వందలు కాదు.. వేలు కాదు ఏకంగా లక్షల్లో బిల్లు వేసి షాక్‌కు గురిచేసింది. బిల్లును చూసి ఒక్కసారిగా కంగుతిన్న ఆ వృద్ధురాలు వినూత్న రీతిలో నిరసన తెలిపింది.
హరియాణా రాష్ట్రం పానిపట్ ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల సుమన్ 60 ఏళ్లుగా తన ఇంట్లో ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. కాగా, తాజాగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ ఆమెకు షాక్ ఇచ్చింది. ఏకంగా 21 లక్షల 89 వేల రూపాయల కరెంటు బిల్లును ఆమెకు అందజేసింది. అది చూసిన ఆమె ఒక్కసారిగా కంగుతింది. ఈ క్రమంలోనే వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది. బిల్లు రిసిప్ట్‌తో పాటు ఓ బ్యానర్‌ను పట్టుకుని విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ బ్యాండ్ వాయిస్తూ.. మిఠాయిలు పంచి మరీ నిరసన వ్యక్తం చేసింది. ఇంతకీ ఆ బ్యానర్‌లో ఏం రాసుందో తెలుసా.. ‘ఇంత బిల్లు నేను కట్టలేను, అందుకే నా ఇంటిని అమ్మాలనుకుంటున్నాను. బిల్లు కిందకు ఈ ఇంటిని మీరే తీసుకోండి” అని రాసిఉంది. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. కాగా, 2019లోనూ సుమన్‌కు 12 లక్షల విద్యుత్ బిల్లు వచ్చిందంట. అయితే గత నెలలోనే ఆ బిల్లు మొత్తం చెల్లించినట్లు బాధితురాలు తెలిపింది. ప్రస్తుతం వచ్చిన బిల్లును తాను చెల్లించలేనని వాపోయింది. బిల్లు కట్టాలంటే తన ఇల్లు విక్రయించడం ఒక్కటే మార్గమని ఆవేదన వ్యక్తం చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

