Viral: 35 కి.మీ రిక్షా తొక్కి తండ్రిని ఆస్పత్రిలో చేర్చిన బాలిక.! హృదయాన్ని కదిలిస్తుంది.

Viral: 35 కి.మీ రిక్షా తొక్కి తండ్రిని ఆస్పత్రిలో చేర్చిన బాలిక.! హృదయాన్ని కదిలిస్తుంది.

Anil kumar poka

|

Updated on: Oct 29, 2023 | 9:16 PM

ఒడిశాలోని భద్రక్‌ జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. ఆస్పత్రికి వాహనంలో వెళ్లేందుకు స్థోమత లేక గాయపడిని తండ్రిని రిక్షాలో తీసుకెళ్లింది ఓ కుమార్తె. 35 కిలో మీటర్లు తానే స్వయంగా రిక్షా తొక్కుతూ తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్టోబర్ 22న జరిగిన ఈ ఘటన ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. జిల్లాలోని దుసూరి నడిగావ్ ప్రాంతానికి చెందిన శంభునాథ్​ సేథి అనే వ్యక్తి అక్టోబర్ 22న గాయపడ్డాడు. వాహనంలో ఆస్పత్రికి వెళ్లడానికి డబ్బులు లేక..

ఒడిశాలోని భద్రక్‌ జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. ఆస్పత్రికి వాహనంలో వెళ్లేందుకు స్థోమత లేక గాయపడిని తండ్రిని రిక్షాలో తీసుకెళ్లింది ఓ కుమార్తె. 35 కిలో మీటర్లు తానే స్వయంగా రిక్షా తొక్కుతూ తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్టోబర్ 22న జరిగిన ఈ ఘటన ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. జిల్లాలోని దుసూరి నడిగావ్ ప్రాంతానికి చెందిన శంభునాథ్​ సేథి అనే వ్యక్తి అక్టోబర్ 22న గాయపడ్డాడు. వాహనంలో ఆస్పత్రికి వెళ్లడానికి డబ్బులు లేక.. అతడి 14 ఏళ్ల కుమార్తె శంభునాథ్​ను రిక్షాపై ధామ్​నగర్​ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అనంతరం అదే రిక్షాపై 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న భద్రక్​ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే శంభునాథ్​కు ఆపరేసన్‌ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో చేసేదేమీ లేక రిక్షాలో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఆస్పత్రి నుంచి రెండు కిలో మీటర్లు ప్రయాణించాక.. బాలిక రిక్షా తొక్కడాన్ని కొందరు విలేకరులు గమనించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న భద్రక్​ ఎమ్మెల్యే, ధామ్​నగర్ మాజీ ఎమ్మెల్యే ఘటనా స్థలికి చేరుకుని.. బాధితుల పరిస్థితి తెలుసుకున్నారు. అనంతరం బాలిక తండ్రి చికిత్సకు, ఆస్పత్రిలో వారి బసకు ఏర్పాట్లు చేశారు. ఇలాంటి ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లో ఈ ఏడాది మేలో అంబులెన్స్​లో కుమారుడి మృతదేహాన్ని తరలించేందుకు డబ్బులు లేక.. బ్యాగులో పెట్టి బస్సులో ఇంటికి తీసుకెళ్లాడు ఓ వ్యక్తి!. అంతకు ముందు పిడుగుపాటుతో మృతిచెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని బైక్​ 10 కిలోమీటర్లు తీసుకెళ్లారు అతడి బంధువులు. ఈ హృదయ విదారక ఘటన ఒడిశాలోని అనుగుల్ జిల్లాలో జరిగింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..