110 ఏళ్లు బామ్మ…4 తరాల పిల్లలతో గ్రాండ్‌గా బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియో
మన దేశంలో ఇటీవల కాలంలో 60 ఏళ్లు దాటితే చాలు, బిపి, షుగర్ అంటూ హాస్పిటల్ చుట్టూ తిరిగేవారు ఎక్కువ. కానీ పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ బామ్మ 110 ఏళ్ల వయసులోనూ ఎంతో యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉన్నారు. తన పనులన్నీ తానే చేసుకుంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదల మండలం కనకర్తి గ్రామానికి చెందిన తాళ్ళపల్లి పోచమ్మ 110వ జన్మదిన వేడుకలను ఆమె కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. పోచమ్మ భర్త మైసయ్య 40 ఏళ్ల క్రితం చనిపోయారు. వీరికి ఐదుగురు కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. మొత్తం 42 మంది మనవళ్లు, మనవరాళ్లతో కలిపి ఈ బామ్మ ఏకంగా నాలుగు తరాలను చూశారు. 110 సంవత్సరాల వయసులో కూడా పోచమ్మ యాక్టివ్‌గా ఉన్నారు. తన పనులు తానే స్వయంగా చేసుకుంటూ ఆరోగ్యంగా జీవనం కొనసాగిస్తున్నారు. ఈమె మనవళ్లు, మనవరాళ్లు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఈమె మాత్రం ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉండడం విశేషం. 110వ పుట్టినరోజు సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులంతా కలిసి వచ్చి పోచమ్మను షాలువాతో సత్కరించారు. అందరూ కలిసి విందు భోజనాలు చేసి ఈ అరుదైన పుట్టినరోజును ఆనందంగా జరుపుకున్నారు. పోచమ్మ ఆరోగ్యానికి రహస్యం ఏంటో తెలుసుకోవడానికి ఆమె ఆహారపు అలవాట్లను జీవనశైలిని తెలుసుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
అద్భుత దృశ్యం.. ఆకాశానికి తాకుతున్న సముద్రం వీడియో
దసరా నవరాత్రులు ఈసారి 9 కాదు.. 10 రోజులు.. ఎందుకో తెలుసా?వీడియో
ఎంత గొప్ప మనస్సు..సొంత ఇంటిని పాఠశాలగా మార్చిన లారెన్స్ వీడియో
ఆపరేషన్ మధ్యలో వదిలేసి ఇదేం పాడుపని డాక్టరూ వీడియో
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
