వందే భారత్‌ రైలుకు “కవచ్‌” రక్ష.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర, పాల్వాల్‌ మధ్య పరీక్ష

|

Feb 19, 2024 | 8:24 PM

రైళ్లు పరస్పరం ఢీ కొట్టుకోకుండా చూసేందుకు దేశీయంగా రూపొందించిన యాంటీ కొలిజన్‌ డివైస్‌ ‘కవచ్‌’ను రైల్వే అధికారులు శుక్రవారం తొలిసారిగా వందేభారత్‌ రైలుపై విజయవంతంగా పరీక్షించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఈ రైలుకు ఈ వ్యవస్థ ఆటోమేటిగ్గా బ్రేకులు వేసింది. 8 బోగీలున్న వందేభారత్‌ రైలుపై దీన్ని పరీక్షించారు. ‘కవచ్‌’ను రీసెర్చ్‌ డిజైన్స్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ సంస్థ రూపొందించింది.

రైళ్లు పరస్పరం ఢీ కొట్టుకోకుండా చూసేందుకు దేశీయంగా రూపొందించిన యాంటీ కొలిజన్‌ డివైస్‌ ‘కవచ్‌’ను రైల్వే అధికారులు శుక్రవారం తొలిసారిగా వందేభారత్‌ రైలుపై విజయవంతంగా పరీక్షించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఈ రైలుకు ఈ వ్యవస్థ ఆటోమేటిగ్గా బ్రేకులు వేసింది. 8 బోగీలున్న వందేభారత్‌ రైలుపై దీన్ని పరీక్షించారు. ‘కవచ్‌’ను రీసెర్చ్‌ డిజైన్స్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ సంస్థ రూపొందించింది. అత్యవసర సమయంలో లోకోపైలట్‌ బ్రేకులు వేయకుంటే ఇది స్పందించి రైలును ఆపేస్తుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర, పాల్వాల్‌ మధ్య తాజా పరీక్ష జరిగింది. ఇందులో రైలును గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిపారు. లోకోపైలట్‌ దీనికి బ్రేక్‌లు వేయలేదు. అయినా అందులోని ‘కవచ్‌’ వ్యవస్థ.. రెడ్‌ సిగ్నల్‌ను గుర్తించి, బ్రేక్‌ వేసింది. సిగ్నల్‌కు 10 మీటర్ల దూరంలో రైలును ఆపేసింది. తాజా ప్రయోగం ఆధారంగా.. దేశవ్యాప్తంగా 8 బోగీలున్న వందేభారత్‌ రైళ్లలోని కవచ్‌ వ్యవస్థకు ప్రమాణాలను ఖరారు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థకు స్టేషన్‌ కవచ్‌, పట్టాల వెంబడి ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు, కవచ్‌ టవర్లు అవసరం. వీటిని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఆ తరువాత 16 బోగీలున్న వందేభారత్‌ రైళ్లపై దీన్ని పరీక్షించనున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయోధ్యకు నేపాల్ మీదుగా పాక్ మహిళ పాదయాత్ర !!

రాజధాని ఫైల్స్‌ సినిమా ప్రదర్శనకు పోలీసుల బ్రేక్

బంగారం కంటే విలువైనది.. బ్రోకలీ గురించి మీకు తెలియని నిజాలు !!

రిటైర్ అయినా సొసైటీకి టీచర్.. 12 ఏళ్లుగా ఫ్రీ సర్వీస్ !!

చంద్రుడి పుట్టుక గుట్టు విప్పనున్న జపాన్‌ వ్యోమనౌక