Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు పట్టాలెక్కేస్తున్నాయ్‌..లోపల చూస్తే అదిరిపోతారంతే..!

వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు పట్టాలెక్కేస్తున్నాయ్‌..లోపల చూస్తే అదిరిపోతారంతే..!

Phani CH
|

Updated on: Jun 24, 2025 | 6:07 PM

Share

రైలు ప్రయాణికులకు నిజంగానే ఇది గుడ్‌న్యూస్‌గా చెప్పాలి. ఎందుకంటే.. జూలై నెలలో వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలపై పరిగెత్తనున్నాయి. ఈ రైళ్లు రాత్రిపూట ప్రయాణాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. వేగవంతమైన ప్రయాణం, ఆధునిక సౌకర్యాలతోపాటు హాయిగా నిద్రపోయేందుకు అనుకూలంగా బెర్తులు అందుబాటులో ఉండనున్నాయి.

ప్రస్తుతం ఉన్న సీటింగ్ వందే భారత్ రైళ్లకు కొనసాగింపుగా ఇవి ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించనున్నట్టు రైల్వే వెల్లడించింది. వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ రైలుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట చేరి ప్రయాణికులను ఊరిస్తోంది. పూర్తి అందుబాటులోకి రాకమునుపే.. నిర్మాణంలో ఉన్న వందే భారత్ స్లీపర్ ట్రైన్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియోలో ట్రైన్‌ లోపలి ఇంటీరియర్, బెడ్లు, సౌకర్యాలన్నీ ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రైళ్లో ప్రయాణించడం అంటే..హై-ఎండ్ హోటల్‌లో ఒకరాత్రి గడిపిన ఫీలింగ్ తప్పక కలుగుతుందని చెబుతున్నారు. స్లీపర్ కోచ్ వేరియంట్లను ప్రవేశపెట్టడం ద్వారా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను విస్తరించాలని భారత రైల్వే నిర్ణయించింది. ప్రారంభంలో 9 వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఉత్పత్తి చేస్తారు. తరువాత వీటి సంఖ్యను 50కి పెంచాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఇందుకోసం బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్‌కి తయారీ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ఈ వందేభారత్‌ రైళ్లు పూర్తిగా మేక్ ఇన్ ఇండియా కింద రూపుదిద్దుకుంటున్నాయి. చెన్నైలోని ICF ఫ్యాక్టరీలో కోచ్‌ల తయారీ శరవేగంగా జరుగుతోంది. గంటకు 160 కి.మీ వేగంతో ఈ ట్రెయిన్‌ ప్రయాణిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాఫీ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. ఈ కాఫీతో మీ ఆయుష్షు డబుల్‌

షాకింగ్ న్యూస్.. బ్రెయిన్ ఎన్యోరిజమ్‌ వ్యాధితో బాధపడుతున్ సల్మాన్

శక్తిమాన్ గా అల్లు అర్జున్! ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

పుష్ఫ విలన్ గ్యారేజీలో.. వోక్స్ వ్యాగన్‌ లోనే స్పీడెస్ట్ కార్‌!

బెస్ట్ ఫ్రెండ్ మొగుడిని పటాయించి.. పెళ్లికి ముందే.. ఆ పని చేసి..! హీరోయిన్ సుద్దపూసినీ ఏశాలు..!