కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ కాఫీతో మీ ఆయుష్షు డబుల్
కాఫీ ప్రియులకు నిజంగా గుడ్ న్యూసే ఇది. ఎందుకంటే ఇటీవల కాఫీ ఆరోగ్యానికి మంచిదికాదని ఒకసారి, చాలా మంచిదని మరోసారి ప్రజలను కన్‌ఫ్యూజన్‌లో పడేస్తున్నారు. దీంతో కాఫీ ప్రయులు అసలు కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా...కాదా అనే సందేహంలో పడిపోతున్నారు. ఈ సందిగ్ధంలో తమకెంతో ఇష్టమైన కాఫీని వదలలేక, తాగినా దాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు.
ఇలాంటివారికి అమెరికా సైంటిస్టులు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. కాఫీ ప్రియులు నిరభ్యంతరంగా కాఫీ తాగొచ్చని, అది మీ ఆయుష్షును కూడా పెంచుతుందని చెప్పారు. అయితే ఈ కాఫీలో చిన్న మార్పు చేశారు. అదేంటో చూద్దాం.. అదేంటంటే.. రోజూ మీరు తాగే మిల్క్, షుగర్ కలిపిన కాఫీ కాకుండా బ్లాక్ కాఫీ తాగాలని సూచించారు. అది కూడా రోజుకి ఒకటి రెండు కప్పులు మాత్రమే తాగాలి. ఇలా బ్లాక్ కాఫీ తాగేవారికి వివిధ ఆరోగ్య సమస్యల వల్ల సంభవించే మరణ ముప్పు 14 శాతం తగ్గుతుందని అమెరికాలోని టఫ్ట్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు. కాఫీ డికాక్షన్‌కు అదనంగా పాలు, చక్కెర కలిపితే దాని ప్రయోజనం తగ్గిపోతుందని వీరి కొత్త అధ్యయనం పేర్కొంటోంది. కాఫీలోని బయోయాక్టివ్ రసాయనాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరీ ఎక్కువ చక్కెర, చిక్కని పాలు కలిపితే ఉపయోగం ఉండదని ‘జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్’లో ప్రచురితమైన ఈ అధ్యయన సీనియర్ రచయిత ఫాంగ్ ఫాంగ్ జాంగ్ తెలిపారు. 1999-2018 మధ్య అమెరికాలో నమోదైన మరణాలను ఈ అధ్యయనం కోసం పరిశీలించారు. 20 ఏళ్లు పైబడిన 46,000 మందిని ఇంటర్వ్యూ చేశారు. బ్లాక్‌కాఫీ రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువ తాగితే మాత్రం ఆరోగ్య ప్రయోజనం ఉండదని అధ్యయనం స్పష్టం చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షాకింగ్ న్యూస్.. బ్రెయిన్ ఎన్యోరిజమ్ వ్యాధితో బాధపడుతున్ సల్మాన్
శక్తిమాన్ గా అల్లు అర్జున్! ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
పుష్ఫ విలన్ గ్యారేజీలో.. వోక్స్ వ్యాగన్ లోనే స్పీడెస్ట్ కార్!
బెస్ట్ ఫ్రెండ్ మొగుడిని పటాయించి.. పెళ్లికి ముందే.. ఆ పని చేసి..! హీరోయిన్ సుద్దపూసినీ ఏశాలు..!
రోడ్డుపక్కన ఫుడ్ స్టాల్‌లో సర్వర్‌గా పని చేస్తున్న కోతి.. సెల్ఫీలు తీసుకుంటున్న కస్టమర్స్
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

