ఒక్క ఉద్యోగానికి ఇంతమందా ?? నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతున్న వీడియో
హైదరాబాద్ లో నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతోంది ఓ వీడియో. కేవలం ఒక్క పోస్టుకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించగా వందలాదిగా వచ్చిన నిరుద్యోగులతో ఆ ఆఫీసు ప్రాంగణం జాతరను తలపించింది. ఓ అభ్యర్థి దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. హైదరాబాద్ లోని ఓ ఐటీ కంపెనీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకే ఒక్క సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఖాళీగా ఉంది, అర్హులైన అభ్యర్థులు రెజ్యుమేతో వాక్ ఇన్ కు హాజరు కావాలని టైం, డేట్ ప్రకటించింది.
హైదరాబాద్ లో నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతోంది ఓ వీడియో. కేవలం ఒక్క పోస్టుకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించగా వందలాదిగా వచ్చిన నిరుద్యోగులతో ఆ ఆఫీసు ప్రాంగణం జాతరను తలపించింది. ఓ అభ్యర్థి దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. హైదరాబాద్ లోని ఓ ఐటీ కంపెనీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకే ఒక్క సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఖాళీగా ఉంది, అర్హులైన అభ్యర్థులు రెజ్యుమేతో వాక్ ఇన్ కు హాజరు కావాలని టైం, డేట్ ప్రకటించింది. ఉన్నది ఒకటే పోస్టు కావడంతో ఇరవై మందో ముప్పై మందో వస్తారని కంపెనీ యాజమాన్యం భావించగా.. ఏకంగా వందలాది మంది తరలిరావడంతో వారు ఆశ్చర్యపోయారు. వచ్చిన వారందరినీ కంట్రోల్ చేయడానికి ఆ కంపెనీ సెక్యూరిటీ సిబ్బంది నానా తంటాలు పడ్డారు. జాతరను తలపించేలా కనిపించిన నిరుద్యోగులను చూసి హెచ్ ఆర్ సిబ్బంది కంగుతిన్నారు. వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆటో డ్రైవర్ ఆకాశంలో.. ప్రయాణికులు నేలపై.. నెట్టింట ఆకట్టుకుంటున్న వీడియో
ఇజ్రాయెల్‌కు చమురు, ఆహార ఎగుమతులు ఆపండి.. ఇరాన్ పిలుపు
Mini Bullet: నెట్టింట చక్కర్లు కొడుతున్న మినీ బుల్లెట్..
అమెరికాలో తెలంగాణ విద్యార్ధిపై దాడి.. పరిస్థితి విషమం
ఇంటి సీలింగ్ నుంచి పాములను బయటకు తీసిన మహిళ..
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

