నాకు పెళ్లి చేసేయండి.. హనీమూన్ షెడ్యూల్ కూడా మీరే ఫిక్స్ చేయండి వీడియో
స్టార్ హీరోయిన్ త్రిష పెళ్లి వార్తలపై ఘాటుగా స్పందించారు. చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్తతో వివాహం అంటూ వస్తున్న పుకార్లను ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సెటైరికల్‌గా ఖండించారు. తన జీవితం గురించి ప్లాన్ చేస్తున్నవారిని ప్రేమిస్తున్నానని, హనీమూన్ షెడ్యూల్ కూడా వారే ఫిక్స్ చేయాలంటూ పోస్ట్ చేశారు.
స్టార్ హీరోయిన్ త్రిష వివాహం గురించి ఇటీవల సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. చండీగఢ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో త్రిషకు పెళ్లి కుదిరిందని, ఆమె తల్లిదండ్రులు ఈ సంబంధాన్ని ఖరారు చేశారని, త్రిష కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కథనాలు ప్రచారమయ్యాయి. మీడియా ఛానెళ్లు సైతం ఈ వార్తలను అధికారికంగా ధృవీకరిస్తున్నట్లుగా పలు కథనాలను ప్రచురించాయి.ఈ పుకార్లపై త్రిష ఘాటుగా స్పందించారు. శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. “నా జీవితం గురించి ప్లాన్ చేస్తున్నవారిని నేను ప్రేమిస్తున్నాను. నా పెళ్లి కుదిర్చారు కదా, ఇక హనీమూన్ షెడ్యూల్ కూడా చెబుతారేమోనని వేచి చూస్తున్నా” అంటూ సెటైరికల్‌గా రాశారు. ఈ పోస్ట్ ఆమె పెళ్లి చేసుకోవడం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
