Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చావులోనూ వీడని బంధం.. తెలియికుండానే ఒకే రోజు మరణించిన ప్రాణస్నేహితులు

చావులోనూ వీడని బంధం.. తెలియికుండానే ఒకే రోజు మరణించిన ప్రాణస్నేహితులు

Samatha J
|

Updated on: Jul 01, 2025 | 4:44 PM

Share

వారిద్దరూ ప్రాణ స్నేహితులు. ఏ సమస్య వచ్చినా ఇద్దరూ చర్చిచుకునేవారు. నిత్యం కుటుంబం కోసం ఆలోచించేవారు. కానీ ఇద్దరూ వరకట్న వేధింపులకు బలి అయిపోయారు. దీంతో ఈ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన ఇద్దరు స్నేహితులు అదునపు వరకట్న దాహానికి బలి అయ్యారు. ఈ దుర్ఘటనలు వేరువేరుగా జరిగినప్పటికీ స్నేహితురాళ్లు ఇద్దరూ అనుకోకుండా ఒకే రోజు మృత్యువుడిలోకి చేరుకోవడం అందరి హృదయాలను కలచివేసింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ కు చెందిన మమత, పెద్దపల్లి జిల్లా ఎన్ టి పీసీ ప్రగతినగర్ కు చెందిన అనుష. ఇందిరానగర్ లోని ఓ డైరీలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరి అత్తమామలు భర్తల నుంచి అదునపు కట్నం కోసం వేధింపులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు పెద్దలతో పంచాయితీ పెట్టిన మార్పు రాకపోవడంతో రోజురోజుకు వారి వేధింపులు ఎక్కువవడంతో విసిగిపోయిన ఇద్దరూ ఒకరి బాధలు ఒకరికి చెప్పుకొని ఓదార్చుకున్నారు. ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ఓ నిర్ణయానికి వచ్చారు. జూన్ 23న వేరువేరు చోట్ల ఇద్దరూ పురుగుల మందు తాగేశారు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జూన్ 26న ఇద్దరూ మృతి చెందారు. ఈ ఊహించని ఆత్మహత్యలు, మృతుల కుటుంబ సభ్యులను తోటి ఉద్యోగులను తీవ్రంగా కలచివేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మరిన్నివీడియోల కోసం :

ఫ్యాన్స్‌కు రష్మిక అదిరిపోయే ఆఫర్‌..ఆ ఒక్కపని చేస్తే లుస్తానంటూ పోస్ట్‌

డబ్బుల కోసం పోస్టాఫీసుకి పోతే.. పాస్‌బుక్‌పై ఉన్నది చూడగా వీడియో

చిరుతలనే పరుగులు పెట్టించిన ఎద్దు వీడియో వైరల్