కొబ్బరి చెట్టెక్కిన చిరుత.. మెల్లిగా చూస్తూ ఏం చేసిందంటే వీడియో
అడవులు నశించిపోవడం.. ఉన్నవాటిలో ఆహారం, నీటి కొరతతో వన్యప్రాణులకు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో జంతువులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఆహారం వెతుక్కుంటూ గ్రామాలు, పుణ్యక్షేత్రాలు ఇలా జనాలు సంచరించే ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అలా ఆహారం కోసం వచ్చిన ఓ చిరుత కొబ్బరి చెట్టుపై తిష్ట వేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. తిప్పలదొడ్డి గ్రామంలో చిరుత పులి కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అటుగా వెళ్తున్న స్థానికులు కొబ్బరిచెట్టుపై చిరుతను చూసి షాకయ్యారు. అంత ఎత్తయిన చెట్టుపైకి చిరుత ఎలా వెళ్లిందని ఆశ్చర్యపోయారు. ఏ క్షణంలో ఎవరిపైన పడుతుందోనని భయభ్రాంతులకు గురయ్యారు. చిరుతను చూసేందుకు గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. కొందరు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు అటవీ సిబ్బంది. కాగా చిరుతను రెచ్చగొట్టేలా ఎలాంటి పనులకు పూనుకోవద్దని.. అటవీ శాఖ సిబ్బంది గ్రామస్థులకు సూచించారు.
మరిన్నివీడియోల కోసం :
ఫ్యాన్స్‌కు రష్మిక అదిరిపోయే ఆఫర్..ఆ ఒక్కపని చేస్తే లుస్తానంటూ పోస్ట్
డబ్బుల కోసం పోస్టాఫీసుకి పోతే.. పాస్‌బుక్‌పై ఉన్నది చూడగా వీడియో
చిరుతలనే పరుగులు పెట్టించిన ఎద్దు వీడియో వైరల్

వర్క్ ఫ్రం హోమ్ అంటే ఆశపడ్డ మహిళ.. కట్ చేస్తే..

‘దగ్గరికొస్తే దూకి చస్తా’.. పోలీసులకు నేరస్తుడి వార్నింగ్

సెకండ్ హ్యాండ్ సైకిల్ పైన వీధి కుక్క తో 15 రాష్ట్రాల యాత్ర

మనవళ్లే.. ఆ రైతన్నకు కాడెద్దులు వైరల్ వీడియో

ఫోన్ చూసీ.. చూసీ.. చివరికి ఒక వ్యక్తికి ఏమైందో తెలుసా?వీడియో

ఇదేంటి భయ్యా.. తాగకుండానే పాజిటివ్ వీడియో

తన భర్త మరో మహిళను చూడగానే ఆడ గొరిల్లా ఏం చేసిందంటే?వీడియో
