మేఘాలు భూమ్మీదకొచ్చాయా..? పాడేరులో అబ్బురపరిచే ప్రకృతి అందాలు
పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయి. పాడేరులో 17 డిగ్రీల కన్నా తక్కువే నమోదవుతున్నాయి. మంచు విపరీతంగా కురుస్తోంది. పచ్చని కొండల మధ్య తేలియాడే పాల సముద్రం లాంటి మేఘాల సమూహాన్ని వీక్షించి పర్యాటకులు ఫిదా అవుతున్నారు. వీడియో చూడండి....
అల్లూరి జిల్లా పాడేరులో దట్టమైన పొగమంచు కురుస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలోని పలు ప్రాంతాలను తెల్లని మంచు కమ్మేసింది. ఇక్కడ మేఘాలకొండగా పేరుగాంచిన వంజంగి కొండ మంచుకొండను తలపిస్తోంది. కొండల నడుమ పొగమంచు పాలసముద్రాన్ని తలపిస్తోంది. మన్యం అందాలను చూసేందుకు భారీ సంఖ్యలో ఔత్సాహికులు తరలి వస్తున్నారు. పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయి. పాడేరులో 17 డిగ్రీల కన్నా తక్కువే నమోదవుతున్నాయి. మంచు విపరీతంగా కురుస్తోంది.
పచ్చని కొండల మధ్య తేలియాడే పాల సముద్రం లాంటి మేఘాల సమూహాన్ని వీక్షించి పర్యాటకులు ఫిదా అవుతున్నారు. ఓ పక్కన పచ్చని చెట్లు. అంబరాన్ని తాకుతున్నట్లుండే గిరి శిఖరాలు.. ఆ కొండలు మధ్య మధ్యలో తేలియాడుతున్న మేఘాలు.. భానుడి లేలేత కిరణాలు.. చల్ల గాలి ఆహ్లాదం కలిగించే వాతావరణం అద్భుతంగా ఉందని.. పర్యాటకులు చెబుతున్నారు.
రిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..