Pomegranate: దానిమ్మజ్యూస్‌తో గుండెపోటుకు చెక్
దానిమ్మ పండు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఏ సీజన్‌లో అయినా పుష్కలంగా దానిమ్మ పండ్లు దొరుకుతాయి. ఇందులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. సరిగ్గా వాడితే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా అడ్డుకోవడమే కాకుండా వచ్చిన జబ్బులను తగ్గించడంలో కూడా దానిమ్మ సమర్ధవంతగా పని చేస్తుందంటున్నారు నిపుణులు. దానిమ్మ జ్యూస్‌లో రెడ్ వైన్ లేదా గ్రీన్ టీ కంటే మూడురెట్లు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
దానిమ్మ పండు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఏ సీజన్‌లో అయినా పుష్కలంగా దానిమ్మ పండ్లు దొరుకుతాయి. ఇందులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. సరిగ్గా వాడితే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా అడ్డుకోవడమే కాకుండా వచ్చిన జబ్బులను తగ్గించడంలో కూడా దానిమ్మ సమర్ధవంతగా పని చేస్తుందంటున్నారు నిపుణులు. దానిమ్మ జ్యూస్‌లో రెడ్ వైన్ లేదా గ్రీన్ టీ కంటే మూడురెట్లు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా దానిమ్మలో పాలీ ఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయ పడతాయి. అలాగే ధమనుల్లో బ్లాక్స్‌ను నిరోధిస్తుంది. ప్రతి రోజూ దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల రక్త పోటు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయట. బీపీని నియంత్రించడంలో ఈ జ్యూస్ బాగా సహాయ పడుతుందని నిపుణులు అంటున్నారు. ఇటీవల జరిగిన అధ్యయనాల్లో ప్రతి రోజూ దానిమ్మ రసం తాగితే గుండె పోటు వచ్చే ప్రమాదం చాలావరకూ తగ్గుతుందని తేలింది. అంతేకాదు, దానిమ్మ జ్యూస్ క్యాన్సర్ కణాలు అభివృద్ధి కాకుండా అడ్డుకుంటుంది. శరీరంలో ఉండే ట్యాక్సీన్లను, వ్యర్థాలు, మలినాలను బయటకు పంపేందుకు సహాయ పడుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మార్చి 15 తర్వాత పేటీఎం క్యూఆర్ కోడ్‌లు, సౌండ్ బాక్సులు పనిచేస్తాయా
గ్యాస్ సిలిండర్ లో నీళ్లు.. ఎందుకొచ్చాయ్ ?? ఎలా వచ్చాయ్ ??
టికెట్ లేకుండా విమానం ఎక్కేసింది.. ఆ తర్వాత ??
ఇంటి గుమ్మంలో నల్ల చిరుత… ఇంతకీ తలుపు కొట్టిందా ?? లేదా ??
వందే భారత్ రైలుకు “కవచ్” రక్ష.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర, పాల్వాల్ మధ్య పరీక్ష