నెల రోజులు రెగ్యులర్‌గా అల్లం తినండి.. జరిగింది చూసి మీరే షాకవుతారు

Edited By: TV9 Telugu

Updated on: Aug 06, 2025 | 4:22 PM

మన వంటగదిలో సులభంగా లభించే అల్లం కేవలం వంటకాలకు రుచిని అందించడమే కాదు, ఆరోగ్యానికి ఓ దివ్య ఔషధంలా పనిచేస్తుందని మీకు తెలుసా? నెల రోజులపాటు రోజు చిన్న అల్లం ముక్కను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అల్లంలోని దాగి ఉన్న ఆ అద్భుత గుణాలు ఏంటో తెలుసుకుందాం. అల్లం ఘాటు అయినా రుచిని కలిగి ఉండటమే కాకుండా ఎన్నో ఔషధ గుణాలు అందులో ఉన్నాయి. ఇందులో జింజెరాల్, షోగోల్, జింజిబెరిన్ వంటి శక్తివంతమైన బయో యాక్టివ్ సమ్మేళనాలతో పాటు విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. శతాబ్దాలుగా అనేక రకాలుగా అనారోగ్యాలను నయం చేయడానికి అల్లాన్ని సంప్రదాయ వైద్యంలో విరివిరిగా ఉపయోగిస్తున్నారు. అల్లంలో ఉండే జింజెరాల్ అనే పదార్థం వికారం, వాంతులు వంటి లక్షణాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కీళ్ళ వాపులను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. అలాగే షోగోల్ అనే సమ్మేళనానికి నొప్పిని నివారించే గుణం ఉంది. ఇది క్యాన్సర్, గుండె జబ్బుల నివారణలో తోడ్పడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇక అల్లంలోని జింజిబెరిన్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అల్లానికి యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయని, మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని, రోగ నిరోధక శక్తిని పెంచుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హీరో అజిత్ తల్లికి పాకిస్తాన్ తో ఏమిటి సంబంధం ??

కూర్చుంటే 2 బిర్యానీలు ఖతం !! యాంకరమ్మ పాత ఫోటోలు చూసి అందరూ షాక్

ఉదయం లేదా రాత్రి.. స్నానం ఎప్పుడు చేస్తే మంచిదో తెలుసా

కమ్మగా ఉన్నాయని మైదా వంటకాలు తెగ తింటున్నారా

Published on: May 12, 2025 07:49 PM