ఈ ఆకులను చీప్‌గా చూడకండి.. నాలుగు ఆకులు తిన్నారంటే రోగాలన్నీ పరార్
ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. మన పెరట్లో దొరికే ఆకులతో కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. అలాంటి వాటిలో తులసి ఒకటి. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. తులసి ఆకులలో విటమిన్ సి, జింక్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి తులసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
తులసిని తీసుకోవడం వల్ల కఫం, శ్లేష్మం తగ్గుతాయి. ఇందులోని యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పి, దగ్గును నయం చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి. తులసిని రోజూ తింటే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇవే కాక తులసి ఆకులు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. చలికాలంలో చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. అటువంటి పరిస్థితిలో తులసిని తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తులసిని సహజమైన యాంటీ డిప్రెసెంట్‌గా చెబుతారు. దీని ఉపయోగం ఒత్తిడిని తగ్గించడం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: