Nandyala: గ్రామంలో ప్రత్యక్షమైన పెద్ద పులి పిల్లలు.. చూడటానికి ఎగబడుతున్న జనం
నంద్యాల జిల్లాలో పెద్ద పులి పిల్లలు ప్రత్యక్షమయ్యాయి. ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లిలో పులి పిల్లలను చూసిన స్ధానికులు ఓచోట దాచిపెట్టారు, పెద్ద గుమ్మడాపురం సమీపంలో నల్లమల అటవీ ప్రాంత నుంచి తప్పించుకుని ఊరి చివర పంట పొలాల్లోకి వచ్చాయి.
నంద్యాల జిల్లాలో పెద్ద పులి పిల్లలు ప్రత్యక్షమయ్యాయి. ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లిలో పులి పిల్లలను చూసిన స్ధానికులు ఓచోట దాచిపెట్టారు, పెద్ద గుమ్మడాపురం సమీపంలో నల్లమల అటవీ ప్రాంత నుంచి తప్పించుకుని ఊరి చివర పంట పొలాల్లోకి వచ్చాయి. నాలుగు పెద్ద పులి పిల్లలను స్థానకులు గుర్తించారు. పులి పిల్లలపై కుక్కలు దాడి చేసి గాయపరచకుండా.. వాటిని తీసుకెళ్లి ఓ గదిలో భద్రపరిచారు. ఈ కూనలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం వచ్చారు. కొందరు సెల్ఫీలు దిగారు. పులి పిల్లలు దొరికిన విషయాన్ని అటవీశాఖఅధికారులకు సమాచారం అందించారు. ఈ పిల్లలు గ్రామం వైపు ఎలా వచ్చాయని స్థానికులు అవాక్కయ్యారు. అటవీశాఖ అధికారులు పులి పిల్లల్ని స్వాధీనం చేసుకోనున్నారు. అయితే ఈ పిల్లలను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలా?.. లేక జూకు తరలించాలా? అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ పిల్లలను జూకి తరలిస్తే తల్లి పులి వీటి కోసం గ్రామంలోకి చొరబడి ప్రజలపై దాడి చేసే అవకాశముందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.