Bangalore Dosa: బెంగళూర్‌ స్పెషల్‌ దోస.. టేస్ట్‌ చూస్తే వదిలిపెట్టరు..:బ్రిటన్‌ హైకమిషనర్‌.

Bangalore Dosa: బెంగళూర్‌ స్పెషల్‌ దోస.. టేస్ట్‌ చూస్తే వదిలిపెట్టరు..:బ్రిటన్‌ హైకమిషనర్‌.

Anil kumar poka

|

Updated on: Mar 06, 2023 | 9:32 AM

దక్షిణాదిలో అమితంగా అందరూ ఇష్టపడే అల్పాహారం ఇడ్లీ, దోస ముందు వరుసలో ఉంటాయి. ఇక ఈ వంటకాలను విదేశీయులు సైతం ఇష్టంగా తింటారు. భార‌త్‌లో బ్రిట‌న్ హైక‌మిష‌న‌ర్

దక్షిణాదిలో అమితంగా అందరూ ఇష్టపడే అల్పాహారం ఇడ్లీ, దోస ముందు వరుసలో ఉంటాయి. ఇక ఈ వంటకాలను విదేశీయులు సైతం ఇష్టంగా తింటారు. భార‌త్‌లో బ్రిట‌న్ హైక‌మిష‌న‌ర్ అలెక్స్ ఎల్లిస్ కూడా వీటిని త‌ర‌చూ ఆస్వాదిస్తారు. ఎల్లిస్ త‌న ఫేవరెట్ ఇండియ‌న్ డిష్ గురించి లేటెస్ట్ ట్వీట్‌లో ప్రస్తావిస్తూ అంద‌రికీ నోరూరించారు. తాను బెంగ‌ళూర్‌కు తిరిగివ‌చ్చానంటూ దోసెను ఎంజాయ్ చేసిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.ఎల్లిస్ గ‌తంలోనూ తాను వ‌డ‌పావ్‌, దోసె, ర‌స‌గుల్లా వంటి భార‌త వంట‌కాల‌ను ఆర‌గిస్తూ ఇండియ‌న్ ఫుడ్‌పై త‌న ఇష్టాన్ని తెలుపుతూ అనేక ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈసారి తాను బెంగ‌ళూర్‌లో ఆర‌గించిన‌ క్రిస్పీ దోసె, సాంబార్, కొబ్బరి చ‌ట్నీతో కూడిన ఫొటోను షేర్ చేశారు. ఇక బ్యాక్ ఇన్ బెంగ‌ళూర్‌..దోసె అంటూ ఈ పోస్ట్‌కు ఎల్లిస్ క్యాప్షన్‌ కూడా ఇచ్చారు.ఈ పోస్ట్‌కు నెటిజ‌న్లు పెద్దసంఖ్యలో రియాక్ట‌య్యారు. ఎల్లిస్ ఇండియ‌న్ ఫుడ్‌ను ఆస్వాదించ‌డాన్ని యూజ‌ర్లు స్వాగ‌తించారు. మీరు బ్రిట‌న్ ఫుడ్‌ను స‌వాల్ చేస్తున్నారు..సార్ అని ఓ యూజ‌ర్ కామెంట్ చేస్తే, ఈ రుచిక‌రమైన దోసె ఎయిర్‌పోర్ట్ హోట‌ల్‌ద‌ని మ‌రో యూజ‌ర్ రాసుకొచ్చారు. బెంగ‌ళూర్‌కు మిమ్మల్ని స్వాగ‌తిస్తున్నామ‌ని మ‌రో యూజ‌ర్ కామెంట్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 06, 2023 09:32 AM