బాసర సరస్వతి ఆలయంలో చోరీ.. హుండీ పగలగొట్టి కానుకలను ఎత్తుకెళ్లిన దొంగలు

|

Aug 17, 2024 | 10:04 PM

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో చోరీ జరిగింది. హుండీ పగలగొట్టి కానుకలను ఎత్తుకెళ్లారు దొంగలు. రాత్రి 11 గంటలకు గోపురంపై నుండి ఒక దొంగ కిందకు దిగినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఆలయంలో హుండీతో పాటు ప్రసాదం, పులిహోర కౌంటర్లలో ఉన్న నగదు దోచుకెళ్లాడు. తెల్లవారుజామున ఆలయ అధికారులకు సమాచారం అందించారు ఆలయ సెక్యూరిటీ గార్డ్స్.

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో చోరీ జరిగింది. హుండీ పగలగొట్టి కానుకలను ఎత్తుకెళ్లారు దొంగలు. రాత్రి 11 గంటలకు గోపురంపై నుండి ఒక దొంగ కిందకు దిగినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఆలయంలో హుండీతో పాటు ప్రసాదం, పులిహోర కౌంటర్లలో ఉన్న నగదు దోచుకెళ్లాడు. తెల్లవారుజామున ఆలయ అధికారులకు సమాచారం అందించారు ఆలయ సెక్యూరిటీ గార్డ్స్. దీంతో పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వార్డ్స్‌తో ఆలయ పరిసర ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. బాసర అంతరాలయంలో రాత్రి 10 గంటల 20 నిమిషాలకు దొంగ చొరబడి 11:40 నిమిషాలకు బయటకు వెళ్లినట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా తెలుస్తుంది. దాదాపు గంటపాటు అంతరాలయంలో ఉన్న దొంగని అక్కడ హోమ్ గార్డ్ సిబ్బంది గమనించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. ఇంటెలిజెన్స్ బ్యూరో బాసర ఆలయంలో భద్రత వైఫల్యం ఉందని గతంలోనే దేవదాయ శాఖను హెచ్చరించింది. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఆలయంలో చోరీ జరిగిందనే విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శరీరంలో యూరిక్ యాసిడ్‌ ఇబ్బంది పెడుతోందా ?? ఇలా చేయండి

శివుని చుట్టూ చిరుతలు-భక్తులకు భయంతో చెమటలు

రాజు సాయంతో 600 కిలోల నుంచి 60 కిలోలకు తగ్గాడు !!

పెళ్లైన హీరోతో యవ్వారం నడిపింది.. కట్ చేస్తే కెరీర్ క్లోజ్..

స్టెప్పు విషయంలో మొహమాటానికి పోయి.. అడ్డంగా బుక్కైన హరీష్‌

Follow us on