Vizag: సాదాసీదా వీడియో అనుకునేరు.. చిమ్మచీకట్లో ముసుగేసుకుని.. మెల్లిగా అలా..
పైన పేర్కొన్న వీడియోను కాస్త తీక్షణంగా చూడండి. ఓ రోజు నైట్.. అదొక ఇల్లు అనుకునేరు.. కాస్త వీడియో ఫార్వార్డ్ అయ్యాక మీకు షాకింగ్ విషయం బయటపడుతుంది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.
విశాఖలో నిత్యం ఏదో ఒక చోట నేరాలు జరుగుతూనే ఉన్నాయి. కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. చలికాలం కావడంతో దొంగతనాల బెడద ఇప్పుడు జనాల్ని భయపెడుతోంది. అందుకు తగ్గట్టుగానే.. విశాఖపట్నంలో ఓ చోరీ.. సీసీ కెమెరాలో కనిపించిన దొంగ కదలికలు ఆశ్చర్యానికి గురిచేశాయి. వివరాల్లోకి వెళ్తే.. గాజువాక అక్కిరెడ్డిపాలెం ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లోకి చొరబడిన దొంగ.. మూడు మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లాడు. ఉదయం లేచి చూసేసరికి .. మొబైల్ ఫోన్లు కనిపించలేదు. అనుమానం వచ్చి సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీని పరిశీలించారు. దీంతో వారికి ఒకటే షాక్.! గుర్తు తెలియని ఓ వ్యక్తి.. నెమ్మదిగా వచ్చి.. పని చెక్కబట్టుకొని వెళ్లినట్టు గుర్తించారు. ముసుగు వేసుకొని మూడో కంటికి తెలియకుండా జారుకున్నాడు. సీసీ కెమెరాల్లో నమోదైన దొంగ కదలికలు ఆశ్చర్యానికి గురిచేశాయి. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించారు గాజువాక క్రైమ్ పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆటోడ్రైవర్ మంచి మనసుకు నెటిజన్లు ఫిదా వీడియో
మెస్సి పేరుతో టీ స్టాల్.. ఫుట్బాల్ స్టార్ ను కలిసే అవకాశం వీడియో
ఇదేం విచిత్రం.. మండు వేసవి ముందే వచ్చిందా వీడియో
మీరు గ్రేట్ సార్ ఓటు కోసం విమానంలో వచ్చి వీడియో
పాక్లో సంస్కృతం కోర్సు వీడియో
రైల్వే సంచలన నిర్ణయం వీడియో
మెస్సీ కోసం హనీమూన్ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్

