Crime Video: రైలు పట్టాలపై కుమార్తె.. రక్షించడానికి వెళ్లి తండ్రి కూడా.. రెప్పపాటులో అంత అయిపోయింది.

|

Nov 17, 2022 | 9:49 AM

రైలు పట్టాలపై పరుగెడుతున్న కుమార్తెను కాపాడుకుందామని వెళ్లిన తండ్రిని కూడా మృత్యువు కబళించింది. రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో తండ్రి కూతురు మరణించారు. ఈ విషాద సంఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.

గజపతినగరం మండలం మధుపాడ సమీపంలో ట్రైన్ క్రింద పడి తండ్రి, కూతురు మృతి చెందారు. మృతులు గజపతినగరం మండలం ఎస్ లింగాలవలసకు చెందిన బెల్లాన తవుడు, అతని కుమార్తె శ్రావణిగా గుర్తించారు పోలీసులు. ఈ విషాద సంఘటన గురించి తెలియగానే గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడి ఉన్న తండ్రి , కూతురు మృతదేహలను చూసి కుటుంబ సభ్యులు భోరున విలపించారు. గ్రామస్తులను సైతం ఆ ఘటన కలచివేసింది. కాగా మృతుడి తండ్రి కుమారుడి, మనుమరాలి మృతదేహాలను చూసి బోరున విలపించాడు. తన కుమారుడు కి ఎలాంటి ఇబ్బందులు లేవని ఇలా ఎందుకు జరిగింతో తెలియడంలేదంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. తండ్రి, కూతుళ్ల అనుమానాస్పద మృతి గ్రామస్తుల్లో విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు విజయనగరం జీఆర్పీ ఎస్సై రవివర్మ తెలిపిన వివరాల ప్రకారం.. మధుపాడలోని చుట్టాల ఇంటికి వచ్చిన తవుడు, కుమార్తె శ్రావణిని తీసుకుని బైక్‌పై స్థానికంగా ఉన్న రైల్వే ట్రాక్‌ దగ్గరికి వెళ్లారు. మతిస్థిమితం లేని ఆ చిన్నారి రైలు పట్టాలపై పరుగులు పెట్టింది. ఇంతలో అదే ట్రాక్‌పై రైలు వస్తుండటంతో గమనించిన తండ్రి కూతురిని రక్షించడానికి ఆమె వెంట పరుగు తీసాడు. ఇంతలో విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న రైలు ఢీకొని ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడి భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా తవుడుకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె విజయలక్ష్మి నాలుగో తరగతి చదువుతోంది. తవుడు మృతితో అతని భార్యబిడ్డలతోపాటు తల్లిదండ్రులు కూడా దిక్కులేని స్థితిలో పడిపోయారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Nov 17, 2022 08:32 AM