ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు..
యూరియా కోసం అన్నదాతల అవస్తలు అన్నీఇన్నీ కావు. గంటలతరబడి క్యూలో వేచిఉన్నా ఫలితం లేకుండా పోతోంది. ఏ క్షణంలో యూరియా లోడ్ వస్తుందోనని అర్థరాత్రి సైతం పంపిణీ కేంద్రాల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు రైతులు. తెలంగాణలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. అర్థరాత్రి అపరాత్రని లెక్కచేయకుండా పంపిణీ కేంద్రాల దగ్గరే ఎదురుచూస్తున్నారు.
యూరియా కోసం అన్నదాతల అవస్తలు అన్నీఇన్నీ కావు. గంటలతరబడి క్యూలో వేచిఉన్నా ఫలితం లేకుండా పోతోంది. ఏ క్షణంలో యూరియా లోడ్ వస్తుందోనని అర్థరాత్రి సైతం పంపిణీ కేంద్రాల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు రైతులు. తెలంగాణలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. అర్థరాత్రి అపరాత్రని లెక్కచేయకుండా పంపిణీ కేంద్రాల దగ్గరే ఎదురుచూస్తున్నారు. ఎరువుల లారీ ఎప్పుడొస్తుందా అంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పంపిణీ కేంద్రాల దగ్గర బారులు తీరుతున్నారు. రెండుమూడురోజులు వెయిట్ చేసినా యూరియా అందడంలేదంటూ వాపోతున్నారు రైతులు.. కాగా.. యూరియా కష్టాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదన్న మంత్రి .. యూరియా వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోలేకపోయారని విమర్శించారు. దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉందన్నారు. ఆ ప్రభావం తెలంగాణ పైనా ఉందన్న తుమ్మల.. ఆగస్ట్‌లో రావాల్సిన యూరియా పూర్తిగా రాలేదన్నారు.
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

