అంతరిక్షం నుంచి వచ్చిన తొలి వీడియో ఇది.. చూశారా ??

అంతరిక్షం నుంచి వచ్చిన తొలి వీడియో ఇది.. చూశారా ??

Phani CH

|

Updated on: Dec 24, 2023 | 8:58 PM

టెలిస్కోప్ కనుగొనడం దగ్గర నుంచి మొదలైన మానవుడి అంతరీక్ష శోధన ప్రస్తుతం మానవసహిత స్పేస్ మిషన్ల స్థాయికి చేరుకుంది. చంద్రుడిని దాటి ఇతర గ్రహాలపై కాలు మోపేందుకూ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే, అంతరిక్ష యాత్రలకు అత్యంత వేగవంతమైన, ప్రభావశీలమైన కమ్యూనికేషన్ వ్యవస్థ (Deep Space Communication) ఎంతో కీలకం. ఈ దిశగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) కీలక ముందడుగు వేసింది.

టెలిస్కోప్ కనుగొనడం దగ్గర నుంచి మొదలైన మానవుడి అంతరీక్ష శోధన ప్రస్తుతం మానవసహిత స్పేస్ మిషన్ల స్థాయికి చేరుకుంది. చంద్రుడిని దాటి ఇతర గ్రహాలపై కాలు మోపేందుకూ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే, అంతరిక్ష యాత్రలకు అత్యంత వేగవంతమైన, ప్రభావశీలమైన కమ్యూనికేషన్ వ్యవస్థ (Deep Space Communication) ఎంతో కీలకం. ఈ దిశగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) కీలక ముందడుగు వేసింది. అంతరిక్షంలో 31 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి భూమిపైకి లేజర్ సాయంతో ఓ హైడెఫినిషన్ వీడియోను ప్రసారం చేసింది. అంతరిక్షం‌లో సూదూర ప్రాంతం నుంచి భూమ్మీదకు ప్రసారమైన తొలి వీడియో ఇది. కేవలం పదిహేను సెకెన్ల నిడివి గల ఈ వీడియోలో టేటర్స్ అనే పిల్లిని చూపించారు. సైకీ అనే వ్యోమనౌక నుంచి ఈ వీడియోను ప్రసారం చేశారు. మార్స్, జూపిటర్ గ్రహాల మధ్య ఉన్న కక్ష్యలో చక్కర్లు కొడుతున్న సైకీ అనే ఆస్టరాయిడ్‌ను అధ్యయనం చేసేందుకు నాసా ఈ వ్యోమనౌకను ప్రయోగించింది. ఈ వ్యోమనౌక భూమీకి 31 మిలియన్ కిలోమీటర్ల దూరంగా ఉండగా వీడియోను లేజర్ కిరణాల ద్వారా భూమ్మీదకు ప్రసారం చేసింది. శాన్‌డియోగోలోని కాల్‌టెక్‌ యూనివర్సిటీకి చెందిన పాలొమార్ అబ్జర్వేటరీలోని హాలీ టెలిస్కోప్ రిసీవర్ ఈ సిగ్నల్‌ను అందుకుంది. అక్కడి నుంచి దీన్ని దక్షిణ కాలిఫోర్నియాలోని జెట్ ప్రొపల్షణ్ లేబొరేటరీకి పంపించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరదలో చిక్కుకున్న గర్భిణి, చిన్నారి.. ఆ తర్వాత ??

జంబలకిడి పంబ.. ఎంతో దూరంలో లేదు !!

యువతి కిడ్నీలో 300 రాళ్లు !! కారణమేంటంటే ??

రాత్రికి రాత్రి దొంగలు కట్టిన గుడి.. దేవుడుకూడా..

గ్రౌండ్‌లో గోల్ప్‌ ఆడుకుంటున్న వ్యక్తి.. రెండు పాములు పెనవేసుకొని గ్రౌండ్‌లోకి ఎంట్రీ !!