వరదలో చిక్కుకున్న గర్భిణి, చిన్నారి.. ఆ తర్వాత ??
భారీ వర్షాలు, వరదల తాకిడికి దక్షిణ తమిళనాడు కకావికలమైంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, టెంకాశి జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రైళ్ల రాకపోకలు నిలిచిపోవటంతో, తూత్తుకుడి జిల్లాలోని శ్రీవైకుంఠం వద్ద 800 మంది రైలు ప్రయాణికులు చిక్కుకుపోయారు. తమిళనాడులోని కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునేల్‌వేలి, టెన్‌కాశీ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
భారీ వర్షాలు, వరదల తాకిడికి దక్షిణ తమిళనాడు కకావికలమైంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, టెంకాశి జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రైళ్ల రాకపోకలు నిలిచిపోవటంతో, తూత్తుకుడి జిల్లాలోని శ్రీవైకుంఠం వద్ద 800 మంది రైలు ప్రయాణికులు చిక్కుకుపోయారు. తమిళనాడులోని కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునేల్‌వేలి, టెన్‌కాశీ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ జిల్లాల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సహాయక చర్యలు చేపట్టింది. వరదలో చిక్కుకున్న ఓ గర్భిణి, ఏడాదిన్నర చిన్నారిని ఆర్మీ హెలికాప్టర్లో మధురైకి తరలించారు. మరో నలుగురు ప్రయాణికులను కూడా రక్షించినట్లు అధికారులు చెప్పారు. తమిళనాడులో కురుస్తోన్న భారీ వర్షాలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు నిరాశ్రయులైన సంగతి తెలిసిందే. ఈ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నాలుగు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, ఇతర విపత్తు బృందాలు రంగంలోకి దిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు ముమ్మరం చేశారు. నిరాశ్రయులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జంబలకిడి పంబ.. ఎంతో దూరంలో లేదు !!
యువతి కిడ్నీలో 300 రాళ్లు !! కారణమేంటంటే ??
రాత్రికి రాత్రి దొంగలు కట్టిన గుడి.. దేవుడుకూడా..
గ్రౌండ్‌లో గోల్ప్ ఆడుకుంటున్న వ్యక్తి.. రెండు పాములు పెనవేసుకొని గ్రౌండ్‌లోకి ఎంట్రీ !!
మలబద్ధకంతో ఇబ్బందిపడుతున్నారా.. ఇదిగో మీ సమస్యకు సింపుల్ పరిష్కారం