ల్యాబ్‌లో చేప మాంసం ఉత్పత్తి.. దేశంలోనే తొలిసారి

|

Feb 01, 2024 | 8:35 PM

ఇకపై ల్యాబ్‌నుంచి చేపమాంసం ఉత్పత్తి కాబోతోంది. సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (CMFRI) దేశంలోనే తొలిసారి ప్రయోగశాలలో చేప మాంసాన్ని అభివృద్ధి చేయనుంది. సీఫుడ్‌ కు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా సముద్రజీవుల సమతౌల్యాన్నీ సంరక్షించొచ్చని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. చేపల నుంచి వేరు చేసిన కణాలను ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ల్యాబ్‌ సెటప్‌లో అభివృద్ధి చేసి మాంసాన్ని ఉత్పత్తి చేస్తామని CMFRI వివరించింది.

ఇకపై ల్యాబ్‌నుంచి చేపమాంసం ఉత్పత్తి కాబోతోంది. సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (CMFRI) దేశంలోనే తొలిసారి ప్రయోగశాలలో చేప మాంసాన్ని అభివృద్ధి చేయనుంది. సీఫుడ్‌ కు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా సముద్రజీవుల సమతౌల్యాన్నీ సంరక్షించొచ్చని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. చేపల నుంచి వేరు చేసిన కణాలను ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ల్యాబ్‌ సెటప్‌లో అభివృద్ధి చేసి మాంసాన్ని ఉత్పత్తి చేస్తామని CMFRI వివరించింది. దీని రంగు, రుచి, పోషకాలు నిజమైన చేపని పోలి ఉంటాయని తెలిపింది. తొలి దశలో కింగ్‌ ఫిష్‌, చందువాయి చేప, సీర్‌ఫిష్‌ మాంసాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. ఈ ప్రాజెక్టును పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో చేపట్టనున్నట్లు తెలిపింది. ఈమేరకు కృత్రిమ మాంసం తయారీ సంస్థ అంకుర, నీట్‌ మీట్‌ బయోటెక్‌ తో కలిసి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం.. అధిక విలువ కలిగిన సముద్ర చేప జాతుల ప్రారంభ సెల్ లైన్ అభివృద్ధిపై CMFRI పరిశోధన చేస్తుంది. తరువాత పరిశోధన, అభివృద్ధి కోసం చేప కణాలను వేరు చేసి పెంపకం చేపడుతుంది. జన్యు, జీవరసాయనపరమైన అంశాలను విశ్లేషిస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇవి పుచ్చకాయలా ?? మత్తు కాయలా ?? నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

రన్‌వేపై ల్యాండవుతూ కారుపై కుప్పకూలిన విమానం

హాస్టల్‌లోనే బార్‌ ఓపెన్‌ చేసేసాడు.. అంతటితో ఆగక ??

అందుబాటులోకి వచ్చిన వేల ఏళ్లనాటి గుహలు !! వాల్మికి రామాయణం రాసిన చోటు ఇదేనా ??

పొలాల్లో కోతుల బెడదకు కొండముచ్చులతో చెక్‌

Follow us on