ఆగస్టు 1న జీమెయిల్ సర్వీసులు నిలిచిపోనున్నాయా ??

ఆగస్టు 1న జీమెయిల్ సర్వీసులు నిలిచిపోనున్నాయా ??

Phani CH

|

Updated on: Feb 26, 2024 | 8:44 PM

వచ్చే ఆగస్టు 1న జీమెయిల్ సర్వీసులు నిలిచిపోనున్నాయా? ఈ ఏడాది చివరి నాటికల్లా జీమెయిల్ పూర్తిగా కనుమరుగవనుందా?.. సోషల్ మీడియా వేదికగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం కారణంగా జీమెయిల్ యూజర్లలో ఈ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఓ స్క్రీన్‌షాట్ యూజర్లను ఆందోళనలకు గురిచేస్తోంది. ఆగస్టు 1న జీమెయిల్ సర్వీసుకు ముగింపు అంటూ సదరు స్క్రీన్ షాట్‌లో ఉంది.

వచ్చే ఆగస్టు 1న జీమెయిల్ సర్వీసులు నిలిచిపోనున్నాయా? ఈ ఏడాది చివరి నాటికల్లా జీమెయిల్ పూర్తిగా కనుమరుగవనుందా?.. సోషల్ మీడియా వేదికగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం కారణంగా జీమెయిల్ యూజర్లలో ఈ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఓ స్క్రీన్‌షాట్ యూజర్లను ఆందోళనలకు గురిచేస్తోంది. ఆగస్టు 1న జీమెయిల్ సర్వీసుకు ముగింపు అంటూ సదరు స్క్రీన్ షాట్‌లో ఉంది. ఆగస్టు తర్వాత ఈ-మెయిల్స్‌ను పంపించడం, స్వీకరించడం సాధ్యపడదని, స్టోర్ చేసుకోవడం కూడా వీలుకాదని ఆ స్క్రీన్‌షాట్‌లో ఉంది. ఈ స్క్రీన్ షాట్ కొన్ని వేల సంఖ్యలో షేర్ అయ్యింది. అయితే ఈ అనుమానాలను నివృతి చేస్తూ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. జీమెయిల్ సర్వీస్‌ను నిలిపివేయబోమని గూగుల్ తేల్చిచెప్పింది. ‘జీమెయిల్ ఉండటానికే ఉంది’ అంటూ ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్న ఊహాగానాలకుతెరదించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఊళ వేయడం మానేసి నిశ్శబ్దంగా ఉంటున్న తోడేళ్లు.. కారణమేంటంటే ??

25 రోజులు పచ్చి చికెన్ తిన్నాడు !! అయినా నో ఫుడ్ పాయిజన్​.. ఎలా ??

అమెరికాలో నెట్ వర్క్ లేక పనిచేయని సెల్​ ఫోన్లు !! సైబర్‌ దాడే కారణమా ??

నక్షత్రం ఆకారంలో రామాలయం.. దాదాపు 1000 ఏళ్ల చరిత్ర !!

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్‌ తాగితే ఎన్ని ప్రయోజనాలో