ఎలక్ట్రికల్ రంగంలో అద్భుతం.. 200 మైళ్ల వేగంతో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ..!(వీడియో): Electric Air Taxi Video.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఇటీవలి కాలంలో చాలా మంది వీటిని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఇటీవలి కాలంలో చాలా మంది వీటిని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా.. రవాణా వ్యవస్థను మరో మెట్టు ఎక్కించే ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. తాజాగా ఈ సంస్థ.. ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ పరీక్షలు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది.
దీంతో కొత్త రకం రవాణా వ్యవస్థ వైపు తొలి అడుగులు పడే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. విమానం మాదిరిగా ఉన్న ఈ విద్యుత్ వాహనం గంటకు 200 మైళ్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుందట. దీని టెస్ట్ డ్రైవ్‌ను జాబీ ఏవియేషన్ సెంటర్‌లో నిర్వహించినట్లు సమాచారం. ఈవీటీఓఎల్ ఎయిర్‌క్రాఫ్ట్ అని పిలుస్తున్న ఈ కారు పరీక్షలను సెప్టెంబరు 10 వరకూ నిర్వహించనున్నట్లు సమాచారం.కాలిఫోర్నియాలోని బిగ్ సుర్ జాబీ ఎలక్ట్రిక్ ఫ్లైట్ బేస్‌లో ఈ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పరీక్షలు ప్రస్తుతానికి విజయవంతమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటి ద్వారా వాహనం ఎలా పనిచేస్తుందనే డేటాను సేకరిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే భవిష్యత్తులో వీటిని ప్రధాన నగరాల్లో ఎయిర్ ట్యాక్సీలుగా ఉపయోగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Mani Ratnam: మణిరత్నంకు గుర్రం తెచ్చిన కష్టాలు..! గుర్రాన్ని చంపాడు.. బుకాయించబోయి పట్టుబడ్డాడు(వీడియో)
ఆ స్టార్ హీరోకు నో చెప్పిన తమన్..! అసలు మేటర్ ఏంటంటే(వీడియో): Music Director Thaman Video.
భారత్ లో అనూహ్యంగా పెరుగుతున్న కిడ్నీ సమస్య..! సమస్యను గుర్తించడం ఎలా..?(వీడియో): Kidney Problem