బస్సులో ప్రయాణికుడికి గుండెపోటు.. మధ్యలో దించేసిన డ్రైవర్‌..

బస్సులో ప్రయాణికుడికి గుండెపోటు.. మధ్యలో దించేసిన డ్రైవర్‌..

Phani CH

|

Updated on: Oct 05, 2023 | 8:38 AM

ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి గుండెపోటు రాగా.. డ్రైవర్‌ కండక్టర్‌ కనికరం లేకుండా మార్గమధ్యలో కిందికి దించేయడంతో కొద్దిసేపటికి ప్రాణాలు విడిచాడు. ఈ హృదయవిదారక ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం. విరుదునగర్‌ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్‌కి చెందిన 50 ఏళ్ల జ్యోతిభాస్కర్‌, శంకరన్‌కోవిల్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. హోటల్‌కు వెళ్లేందుకు సోమవారం ఉదయం ఓ ప్రైవేటు బస్సు ఎక్కాడు.

ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి గుండెపోటు రాగా.. డ్రైవర్‌ కండక్టర్‌ కనికరం లేకుండా మార్గమధ్యలో కిందికి దించేయడంతో కొద్దిసేపటికి ప్రాణాలు విడిచాడు. ఈ హృదయవిదారక ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం. విరుదునగర్‌ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్‌కి చెందిన 50 ఏళ్ల జ్యోతిభాస్కర్‌, శంకరన్‌కోవిల్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. హోటల్‌కు వెళ్లేందుకు సోమవారం ఉదయం ఓ ప్రైవేటు బస్సు ఎక్కాడు. రాజపాళెయం వద్ద జ్యోతిభాస్కర్‌కు గుండెనొప్పి రావడంతో తోటి ప్రయాణికులు కండక్టర్‌, డ్రైవర్‌కు చెప్పారు. కానీ వారు ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా శంకరన్‌కోవిల్‌ సమీపంలో కిందికి దించి అక్కడున్న టీ దుకాణం ముందు కూర్చోబెట్టి మానవత్వం లేకుండా వెళ్లిపోయారు. కొద్ది గంటల తర్వాత దుకాణం తెరవడానికి వచ్చిన వ్యక్తి పడిపోయి ఉన్న జ్యోతిభాస్కర్‌ను చూసి పైకి లేపడానికి యత్నించాడు. చలనం లేకపోవడంతో అంబులెన్స్‌ ద్వారా రాజపాళెయం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Skanda: 5 రోజుల్లో 50 కోట్లు.. దుమ్ములేపుతున్న స్కంద కలెక్షన్స్

‘కొండెర్రి పప్ప అంటే..’ అమర్‌పై పేలుతున్న జోకులు

‘హీరోయిన్ బట్టలు విప్పించడమే వాళ్ల పని’ హీరోయిన్‌ షాకింగ్ కామెంట్స్

Tiger Nageswara Rao: గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ఊర మాసు దొంగోడు..

Nani: చరిత్ర సృష్టించే సినిమాను మిస్ చేసుకున్న నాని