గాజుల రామారంలో ఘనంగా పల్లకీ సేవ.. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
కోట్లాది భక్తులకు ఆయన ఆధ్యాత్మిక గురువు. ఆయన కులాలకు, మతాలకు అతీతంగా నిలిచారు. ఆయన భక్తులలో హిందువులతో పాటు ముస్లింలు, క్రిస్టియన్లు కూడా చాలామంది ఉన్నారు. ఆయనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. నవంబరు 23న బాబా 98వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లో పలు ఆథ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గాజుల రామారంలోని బాబాకు పల్లకీ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు వివిధ వేషధారణలతో అలరించారు.
కోట్లాది భక్తులకు ఆయన ఆధ్యాత్మిక గురువు. ఆయన కులాలకు, మతాలకు అతీతంగా నిలిచారు. ఆయన భక్తులలో హిందువులతో పాటు ముస్లింలు, క్రిస్టియన్లు కూడా చాలామంది ఉన్నారు. ఆయనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. నవంబరు 23న బాబా 98వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లో పలు ఆథ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గాజుల రామారంలోని బాబాకు పల్లకీ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు వివిధ వేషధారణలతో అలరించారు. చిన్నారుల రాముడు, కృష్ణుడు, రాధ, సత్యభామ, గోపికల వేషధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులు గోపికలుగా మారి ఆడిన కోలాటం, భజనలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాయి. అందరినీ ప్రేమించండి, అందరికీ సేవచేయండి, సహాయం చేయండి, ఎప్పుడూ బాధపడకండి అంటూ చిన్నారులు ప్లకార్డులు ప్రదర్శించారు. భక్తులు బాబా పల్లకీని మోసి తరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రివర్స్‌లో ఆటో నడిపి ఆకట్టుకున్న యువకుడు !! ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
విజయవాడ బస్సు ప్రమాదానికి ప్రాథమిక కారణాలు ఇవే
వెయ్యి రూపాయల కోసం హోర్డింగ్ ఎక్కి యువకుడి హల్‌చల్
Varun Tej-Lavanya Tripathi: ఘనంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ రిసెప్షన్
ఆ ప్రాంతంలోని దేశాలు ఇజ్రాయెల్‌పై దాడికి దిగకుండా నిలువరించే యత్నం