Shreyas Iyer: కుక్క దాడి.. షాక్‌లో శ్రేయస్ అయ్యర్

Updated on: Jan 12, 2026 | 4:00 PM

టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ గాయం నుండి కోలుకుని న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమయ్యారు. వడోదర విమానాశ్రయంలో ఒక పెంపుడు కుక్క ఆయనను కరవబోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. వైస్ కెప్టెన్‌గా తిరిగి వస్తున్న అయ్యర్‌కు మరో ప్రమాదం తప్పింది. అభిమానులు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.

టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కు టైమ్‌ బాగా లేనట్లు కనిపిస్తోంది. 2025 చివర్లో ఆస్ట్రేలియా లో గాయపడ్డారు. దాంతో టీమిండియా జట్టుకు మూడు నెలలు దూరమయ్యారు. క‌డుపులో బ‌లమైన గాయం కావడంతో రెస్ట్‌లో ఉన్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుని న్యూజిలాండ్ జట్టుతో వన్డే ఆడేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి టైమ్‌లో శ్రేయస్‌కు మరో ప్రమాదం తప్పింది. ఓ పెంపుడు కుక్క శ్రేయస్ ను కరవబోయింది. కొంచం లో మిస్సయింది లేకుంటే శ్రేయస్ పై దాడి చేసేది. ఈ వీడియో వైరల్ గా మారింది. న్యూజిలాండ్ తో జరిగే మొదటి వన్డే కోసం శ్రేయస్‌ వడోదర విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ సమయంలో శ్రేయస్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఓ అభిమాని శ్రేయస్‌కు క్లోజ్ గా వెళ్లింది. ఆమె చేతిలో ఉన్న కుక్క తలను నిమిరాలని చూసారు శ్రేయస్‌. కానీ అభిమానికి చెందిన ఆ పెంపుడు కుక్క, శ్రేయస్‌ చేతిని కొరికే ప్రయత్నం చేసింది. వెంటనే చేతిని వెనక్కి తీసుకోవడంతో కుక్క దాడి నుంచి తప్పించుకున్నారు శ్రేయస్‌. వీడియో చూసిన ఫ్యాన్స్ జాగ్రత్త సర్పంచ్ సాబ్, కొంచెం అయితే కండ పీకేది. మళ్లీ ఆసుపత్రి పాలు అయ్యేవాడివి అంటూ కామెంట్లు పెడుతున్నారు. కుక్కలను బయటకు తీసుకురాకండి అని మరి కొంతమంది సూచిస్తున్నారు. దీంతో ఈ ఘటన హాట్ టాపిక్ అయింది. న్యూజిలాండ్‌ తో టీమిండియా వన్డే సిరీస్ జనవరి 11న వడోదరలో మొదలవ్వనుంది. ఈ సిరీస్ కు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు శ్రేయస్‌. దాంతో ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

Weather Update: సంక్రాంతి వేళ వర్ష సూచన ఆ జిల్లాలకు ఐఎండీ అలర్ట్

Andhra Pradesh: పందెం రాయుళ్లకు షాక్ !! కలెక్టర్లు,ఎస్పీలకు హైకోర్టు ఆదేశాలు

Gold Price Today: మండిపోతున్న బంగారం.. రూ.3 లక్షలకు చేరువలో వెండి

Maruthi: అలా అనకండి డార్లింగ్స్‌..మరో సారి చూడండి.. నచ్చుతుంది