PV Sindhu: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న పీవీ సింధు

|

Dec 07, 2024 | 12:02 PM

భారత స్టార్‌ షట్లర్‌, రెండు సార్లు ఒలింపిక్స్‌లో విజయకేతనం ఎగురవేసిన పీవీ సింధు త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో ఈ నెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో వీరి పెళ్లి జరగనుంది. డిసెంబర్‌ 24న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. పెళ్లికి సంబంధించి ముందస్తు కార్యక్రమాలు ఈనెల 20న ప్రారంభం కానున్నాయి.

దీనికి సంబంధించి సింధు తండ్రి పీవీ రమణ వివరాలు వెల్లడించారు. ఈ వార్త ఆమె అభిమానులను ఆనందపరిచింది. రెండు లు ఒకరికొకరు చాలా కాలంగా తెలుసు. అయితే గత నెలలోనే వీరి పెళ్లికి సంబంధించి నిర్ణయానికి వచ్చాం. జనవరి నుంచి ఆమె షెడ్యూల్‌ బిజీగా ఉండడంతో ఈ నెలలోనే పెళ్లి చేయనున్నట్లు నిర్ణయించుకున్నాం. వచ్చే సీజన్‌ తనకు ఎంతో ముఖ్యమైనదని తండ్రి పీవీ రమణ పేర్కొన్నారు. ఇక సింధుని వివాహం చేసుకోబోయే వెంకట దత్త సాయి పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. సింధు తన క్రీడా జీవితంలో ఎన్నో విజయాలను సాధించడమే కాకుండా, భారతదేశానికి ఒలింపిక్ పతకాలు అందించి గౌరవం తీసుకువచ్చింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సముద్రపు ఒడ్డున యోగా చేస్తున్న నటి… అంతలోనే

TOP 9 ET News: బాలీవుడ్‌లో బన్నీ హిస్టరీ.. కలెక్షన్స్‌లో షారుఖ్‌ను దాటి నెంబర్ 1

రూ.294 కోట్ల దిమ్మతిరిగే కలెక్షన్స్.. మొత్తానికి లెక్క తేల్చిన పుష్పరాజ్‌.. AAల్ టైం రికార్డ్ !!

ఎట్టకేలకు స్టార్ హీరో నుంచి జానికి పిలుపు.. మళ్లీ పట్టాలెక్కినట్టే !!

శ్రీశైల మల్లన్నకు మొక్కులు తీర్చుకున్న నాగచైతన్య – శోభిత