విమానంలో బిజినెస్ క్లాస్ సీట్లను వదులుకున్న ద్రావిడ్, రోహిత్, కోహ్లీ !!
టీ20 వరల్డ్ కప్-2022 సెమీ ఫైనల్స్ ఆడేందుకు భారత జట్టు అడిలైడ్ చేరుకుంది. నవంబర్ 10న ఇంగ్లండ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
టీ20 వరల్డ్ కప్-2022 సెమీ ఫైనల్స్ ఆడేందుకు భారత జట్టు అడిలైడ్ చేరుకుంది. నవంబర్ 10న ఇంగ్లండ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. జింబాబ్వే మ్యాచ్ తర్వాత మెల్‌బోర్న్ నుంచి వెంటనే అడిలైడ్‌కు పయనమైంది భారత జట్టు. అయితే ఈ ప్రయాణంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విమానం ఎక్కిన తర్వాత కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ తమ బిజినెస్ క్లాస్ సీట్లను మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యాలకు ఇచ్చారు. వారు మాత్రం ఎకానమీ క్లాస్‌లో కూర్చొని జర్నీ చేశారు. విమానంలో బిజినెస్ క్లాస్ సీట్లు ఎంతో విశాలంగా, సౌకర్యవంతంగా ఉంటాయి. విశ్రాంతి తీసుకునేందుకు ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయి. జట్టులోని ప్రతి ఆటగాడికి బిజినెస్ క్లాస్ సీటు లభించదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనల ప్రకారం ఒక్కో జట్టుకు నాలుగు బిజినెస్ క్లాస్ సీట్లు లభిస్తాయి. చాలా జట్లు తమ కెప్టెన్, వైస్-కెప్టెన్, కోచ్, మేనేజర్‌లకు ఈ సీట్లను అప్పగిస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెమీ ఫైనల్‌కు ముందు షాక్.. రోహిత్ శర్మకు అవుట్ ??
ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం.. ఈ రాశి వారికి ఇది జాక్‌పాట్..
Allu Arjun: ప్రతీ ఫంక్షన్‌లో.. ఇలాంటోడు ఒకడు ఉంటాడే..
Janhvi Kapoor: జాన్వీ మదిలో సమ్‌థింగ్.. సమ్‌థింగ్
Allu Arjun: ప్రాణ మిత్రుడి మాటలకు ఏడ్చేసిన బన్నీ !!