డోపింగ్ టెస్టులో పట్టుబడ్డ క్రికెటర్
ఉత్తరాఖండ్ బౌలర్ రజన్ కుమార్ డోపింగ్ పరీక్షలో విఫలమయ్యారు. అతని నమూనాల్లో అనబాలిక్ స్టెరాయిడ్స్ గుర్తించిన నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) తాత్కాలిక నిషేధం విధించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొన్న రజన్, విజయ్ హజారే ట్రోఫీని కోల్పోనున్నారు. క్రికెట్‌లో డోపింగ్ కేసులు అరుదుగా ఉంటాయి, గతంలో పృథ్వీ షా డోపింగ్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన క్రికెట్ వర్గాల్లో కలకలం రేపింది.
ఉత్తరాఖండ్ బౌలర్ రజన్ కుమార్ డోపింగ్ టెస్టులో పట్టుబట్టారు. తాజాగా నిర్వహించిన డోపింగ్ టెస్టులో అతను ఫెయిల్ అయ్యారు. అతని శాంపిల్‌లో మూడు నిషేధిత పదార్థాలు పాజిటివ్‌గా తేలాయి. అనబాలిక్ స్టెరాయిడ్స్ ను గుర్తించారు. దీంతో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అతనిపై తాత్కాలిక నిషేధం విధించింది. రజత్ ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొన్నారు. రజన్ కుమార్ దోపీగా తేలడం క్రికెట్‌లో కలకలం రేపింది. క్రికెట్‌లో డోపింగ్ కేసులు చాలా అరుదు. చివరిసారిగా డోపింగ్‌లో దొరికి పోయారు స్టార్ క్రికెటర్ పృథ్వీ షా. 2019లో పృథ్వీ షా డోపింగ్‌కు పాల్పడటంతో బీసీసీఐ అతనిపై 8 నెలల నిషేధం విధించింది. డోప్ టెస్ట్ లో ఫెయిలై రజన్ కుమార్ విజయ్ హజారె ట్రోఫీ ఆడే అవకాశాన్ని మిస్ అయ్యారు. టీమిండియా టెస్ట్ వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జనవరిలో విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే అవకాశముందని సమాచారం. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అంతకంటే ముందే వీరు విజయ్ హజారేలో ఆడనున్నారని తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాకు మరో భార్య కావాలి.. వాటర్ ట్యాంక్ ఎక్కి వ్యక్తి హంగామా
ఇద్దరు స్నేహితులకు ఊహించని సహాయం చేసిన డెలివరీ బాయ్
అమ్మబాబోయ్ ఈ చేప ఒక్క కిలో ధర రూ.11 లక్షలు పైనే
ప్రతి నెలా 5 వేల మంది రైడర్లను తొలగిస్తుంటాం.. జొమాటో బాస్ షాకింగ్ ప్రకటన
లండన్ రైల్లో సమోసాలు అమ్మిన బీహారీ.. పరువు తీశావంటూ ట్రోలింగ్
