షాట్ కొడితే.. పోయింది బాల్ కాదు బ్యాట్.. అంపైర్ షాక్
దాదాపు 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. అపూర్వ విజయం సాధించింది. పాకిస్థాన్‌ను వారి సొంతగడ్డపై మూడు టెస్టుల సిరీస్‌లో వైట్ వాష్ చేసి కొత్త చరిత్ర సృష్టించింది.
దాదాపు 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. అపూర్వ విజయం సాధించింది. పాకిస్థాన్‌ను వారి సొంతగడ్డపై మూడు టెస్టుల సిరీస్‌లో వైట్ వాష్ చేసి కొత్త చరిత్ర సృష్టించింది. కొంత కాలంగా టెస్టు క్రికెట్‌ను టీ20 స్టైల్లో ఆడుతున్న ఇంగ్లండ్.. మరోసారి అదే వేగంతో పాక్‌ను మట్టికరిపించింది. ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ కాంబినేషన్‌లో బజ్‌బాల్ స్ట్రాటజీతో ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది ఇంగ్లండ్. అయితే మూడో టెస్ట్ మ్యాచ్‌లో అనుహ్య ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ లెగ్ అంపైర్‌కు దడ పుట్టించాడు. కొద్దిగా అటు ఇటు అయ్యుంటే అంపైర్ తల కచ్చితంగా పగిలేదే. రెహాన్ అహ్మద్ ఔటయ్యాకా స్టోక్స్ క్రీజులో అడుగుపెట్టాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో నుమాన్ అలీ వేసిన ఐదో బంతిని బెన్ స్టోక్స్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే స్టోక్స్ చేతిలో గ్రిప్ జారిన బ్యాట్ స్క్వేర్‌లెగ్‌లో నిలబడిన లెగ్ అంపైర్ పక్కనబడింది. ఈ చర్యతో భయపడిన అంపైర్ హసన్ రాజా కాస్త పక్కకు జరిగి స్టోక్స్‌వైపు చూశాడు. కావాలని చేయలేదు.. బ్యాట్ గ్రిప్ జారిందంటూ వివరించాడు స్టోక్స్. ఇదంతా గమనించిన పాకిస్తాన్ ఆటగాళ్లు నవ్వుల్లో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి స్టోక్స్ తన చర్యతో అంపైర్ గుండెల్లో దడ పుట్టించాడంటూ అభిమానులు కామెంట్స్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లిలో క్రేజీ సీన్.. ఎంజాయ్ చేసిన వధూవరులు..
ఏటీఎంలో జింక.. ఎందుకో తెలిస్తే అయ్యో పాపం అంటారు
కట్నంగా కారు తేలేదని ఆ భర్త ఏం చేశాడో తెలుసా ??
బోర్ కొట్టడంతో.. సరదాగా బ్యాంక్ చోరీ చేసిన వ్యక్తి !!
రైల్వే స్టేషన్‌లో రెచ్చిపోయిన యువకుడు !! కదులుతున్న రైలునుంచి ఒక్కసారిగా..