Watch Video: ఇదేందిరా సామీ.. బౌలర్‌ను ఇలా కూడా కన్ఫ్యూజ్ చేస్తారా? నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

|

Mar 22, 2022 | 3:05 PM

ప్రతిరోజు నెట్టింట్లో ఎన్నో వీడియోలు వైరలవుతుంటాయి. వాటిలో క్రికెట్‌కు సంబంధించిన వీడియోలు కూడా అధికంగానే ఉంటాయనడంలో సందేహం లేదు. ఫీల్డింగ్, బ్యాటింగ్, వికెట్లు ఇలా ఎన్నో విషయాలకు సంబంధించిన వీడియోలు ఇందులో ఉంటాయి.

Watch Video: ఇదేందిరా సామీ.. బౌలర్‌ను ఇలా కూడా కన్ఫ్యూజ్ చేస్తారా? నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
Viral Video (1)
Follow us on

ప్రతిరోజు నెట్టింట్లో ఎన్నో వీడియోలు వైరలవుతుంటాయి(Viral Video). వాటిలో క్రికెట్‌(Cricket)కు సంబంధించిన వీడియోలు కూడా అధికంగానే ఉంటాయనడంలో సందేహం లేదు. ఫీల్డింగ్, బ్యాటింగ్, వికెట్లు ఇలా ఎన్నో విషయాలకు సంబంధించిన వీడియోలు ఇందులో ఉంటాయి. తాజాగా ఓ బ్యాట్స్‌మెన్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోని చూస్తే మీరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇలాంటి బ్యాట్స్‌మెన్‌ను ఇంతవరకు చూడలేదంటూ చెప్పుకుంటారు. సాధారణంగా ఓ బ్యాట్స్‌మెన్ క్రీజులోకి రాగానే ఏ వికెట్‌పై స్టాండ్ తీసుకోవాలో చూస్తాడు. ఈ క్రమంలో మిడిల్, ఆఫ్, లెగ్ వికెట్‌లలో దేనినో ఒక దానిని ఎంచుకుంటాడు. ఇలా చేస్తే ఈ బ్యాటర్ నెట్టింట్లో ఎందుకు ఉంటాడు. ఈ వీడియోలోని బ్యాట్స్‌మెన్ మాములుగానే క్రీజులోకి వచ్చాడు. తొలుత అందరిలానే స్టాండ్ ఎలా తీసుకోవాలో ఆలోచించాడు. ఇందుకు తొలుత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నిల్చొని, అంపైర్‌ను కూడా సలహా తీసుకుని మరీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌లా వికెట్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఫీల్డింగ్ టీం కూడా ఆ ప్రకారమే ఫీల్డర్లను కూడా సెట్ చేసింది. అంతవరకు బాగానే ఉంది. అసలు కథ అప్పుడే మొదలైంది. బౌలర్ బాల్ వేసేందుకు రెడీ అవ్వగా, సడన్‌గా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాండు. అంపైర్‌తోపాటు బౌలర్, ఫీల్డర్లు కూడా షాక్ అయ్యారు. దీంతో చేసేదేం లేక మరోసారి ఫీల్డర్లు బ్యాటర్‌ పోజిషన్‌కు అనుగుణంగా మారిపోయారు. దీంతో నెట్టింట్లో ఈ వీడియో తెగ వైరలవుతోంది. నెటిజన్లు కూడా ఈ బ్యాటర్ ప్రవర్తించిన తీరుకు తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు.

మలేషియన్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తోన్న టీ20 క్లబ్స్ ఇన్విటేషన్ 2022 టోర్నీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రాయల్స్ వారియర్స్ వర్సెస్ కేఎల్ స్టార్స్ టీంల మధ్య జరిగిన మ్యాచ్‌లో హంజర్‌జీత్ సింగ్(రాయల్స్ వారియర్స్) ఇలా స్టాండ్స్ విషయంలో ఫీల్డర్లను విస్మయానికి గురిచేశాడు.

Also Read: IPL 2022: ఐపీఎల్‌లో సూపర్ సీనియర్లు వీరే.. తగ్గేదేలే అంటూ యువకులతో పోటాపోటీ.. వారెవరంటే?

INDW vs BANW: బంగ్లాపై భారత్ భారీ విజయం.. సెమీస్ ఆశలు సజీవం.. ఆకట్టుకున్న స్నేహ్ రాణా, భాటియా